సమంత సీటు ఎవరిది?

Update: 2018-09-29 17:30 GMT
టాప్ హీరోయిన్ లీగ్ లోకి వెళ్ళడం అంత సులువేమీ కాదు. గ్లామర్.. యాక్టింగ్ తో పాటుగా లక్కు కూడా తోడవ్వాలి. ఒక వేళ నటన రాకపోతే లక్కు లక్కలాగా అంటిపెట్టికుని ఉండాలి.  తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే సమంతా పేరు చెప్పాలి.  పెళ్లి తర్వాత కూడా సమంతా గ్లామర్ షోకు రెడీ అంటున్నప్పటికీ హీరోలు సామ్ కు రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదని ఇప్పటికే టాక్ వచ్చింది.  అందుకే సామ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్.. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఆ వార్తలే నిజమనుకుంటే మరి సమంతాకు రీప్లేస్ మెంట్ ఎవరు?  సమంతా స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు? కాజల్.. తమన్నాలు ఉన్నా వాళ్ళు కు ఇంతకు ముందున్నంత క్రేజ్ ఇప్పుడు లేదు.  శ్రుతి హాసన్ టాలీవుడ్ నుండి పూర్తిగా మాయమైంది. ఇక కీయరా అద్వాని ఉన్నప్పటికీ ఆమె తెలుగు కంటే బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.  ఇక సామ్ రేంజ్ ను అందుకోగలిగే వారిలో కీర్తి సురేష్ - పూజా హెగ్డే - రష్మిక మందన్నలు ఉన్నారు.

కీర్తి చేతిలో ఇప్పుడు టాప్ లీగ్ స్టార్ హీరోల సినిమాలు ఏవీ లేవు. రష్మిక కు ఇంకా స్టార్ హీరోల నుండి పిలుపు రాలేదు. పూజ చేతిలో అరవింద సమేత -  మహర్షి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.  దీంతో పూజాకే ఆ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.   చూద్దాం.. పూజా ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందో లేదా 'గీత' పూజను దాటేస్తుందో..!
Tags:    

Similar News