బాలీవుడ్ ఐటమ్ బాంబ్ కోసం 'పుష్ప' ఆరాటం...!

Update: 2020-04-29 10:30 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు లాక్‌ డౌన్ ముందే దేవిశ్రీప్ర‌సాద్ ట్యూన్స్‌ సిద్దం చేసేశార‌ట‌. అయితే వీరి ముగ్గురి కాంబో అంటే మాస్ మసాలా ఐటం సాంగ్ మస్ట్. ఇక ఈయన క్రియేటివిటీకి దేవిశ్రీ ట్యూన్.. బన్నీ డాన్స్ తోడు అయ్యిందంటే మాస్ ఆడియన్స్ థియేటర్స్‌లో చిందులేయాల్సిందే. గతంలో 'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం...' 'ఆర్య 2' సినిమాలో 'రింగ రింగా..' సాంగ్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. అంతేకాకుండా సుకుమార్ చిత్రాల్లో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఐటం సాంగ్ అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు సుకుమార్ లేటెస్ట్ మూవీ 'పుష్ప' మాస్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మాస్ మసాలా ఐటెం సాంగ్ కంపల్సరీ అని ఫిక్స్ అయిపోయాడట. అందుకే ‘పుష్ప’ పక్కన ఆడిపాడే ఆ ఐటెం భామ కోసం వెతుకులాట మొదలుపెట్టారట సుక్కూ. డాన్స్ స్కిల్స్ తోపాటు గ్లామర్ కలిగిన హాట్ బ్యూటీ కోసం ఆయన అనేక పేర్లు పరిశీలిస్తున్నాడట. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో బాలీవుడ్ నుండే ఐటెం బాంబ్ ని దింపే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా టాప్ యాక్ట్రెస్ అయితే మూవీ బిజినెస్ కి కూడా కలిసొస్తుందని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. దీని కోసం పూజాహెగ్డే, మలైకా అరోరా, జాక్వలిన్ ఫెర్నాండేజ్, దిశా పటానీ వంటి హాట్ బ్యూటీస్ ని అనుకుంటున్నారట.

ఇప్పటికే అల్లు అర్జున్ డాన్స్ గురించి ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంటారు. అందుకే ఆ రేంజ్ కి తగ్గకుండా ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో డాన్స్ పై బన్నీ స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా ఐటెం బ్యూటీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా వీరు అనుకున్న బడ్జెట్ లో వస్తే తీసుకోవాలనుకుంటున్నారట. కానీ ఇప్పుడు కరోనా వల్ల మూవీ బడ్జెట్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే స్టార్ హీరోయిన్స్ కాకుండా మీడియం రేంజ్ లో ఛార్జ్ చేసే వాళ్ళతో వెళ్లాలని లెక్కల మాస్టారు లెక్కలు వేస్తున్నాడట. మరి 'పుష్ప'లో ఉండే ఐటెం సాంగ్ డియాలో.. డియాలా ( 100% లవ్).., లండన్ బాబూ.. లండన్ బాబూ (నేనొక్కడినే).. జిల్ జిల్ జిగేలు రాణి (రంగస్థలం) రేంజ్ లో ఉండబోతుందేమో చూడాలి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News