• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను ప్రేమించిన అమ్మాయి...

నేను ప్రేమించిన అమ్మాయి పేరు తప్ప అన్నీ వచ్చాయి!

By - Tupaki Desk
Update: 2019-06-28 11:32 GMT
యువ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే' జులై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈమధ్య సందీప్ కిషన్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.   తమిళంలో ఒకటి అరా విజయాలు లభించినా తెలుగులో మాత్రం వరస ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడుతున్నాడు.  దీంతో సందీప్ తన కొత్తసినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు.  

ప్రస్తుతం సందీప్ ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సందీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. దాదాపు నాలుగేళ్ళుగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా సందీప్ హీరోగా కొనసాగడానికి తనకున్న బ్యాక్ గ్రౌండే కారణమని.. మేనమామ ఛోటా కె నాయుడు వల్లే అది సాధ్యమైందని బయట టాక్ ఉంది.  ఈ విషయాన్నే సందీప్ తో ప్రస్తావిస్తే అది నిజం కాదన్నాడు.  మామ సపోర్ట్ తనకు ఉన్నమాట నిజమే కానీ దాని వల్లే హీరోగా కొనసాగుతున్నానని అనడం సరి కాదన్నాడు.  నేపథ్యం లేని ఇతర హీరోలతో పోలిస్తే తనకు కెరీర్ ప్రారంభంలో కొంత ఎడ్వాంటేజ్ ఉన్నమాట నిజమేనని ఒప్పుకుంటూ.. నాని.. నిఖిల్ లాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలతో పోలిస్తే తనకు స్టార్టింగ్ లో  ఓ 20% ఎడ్వాంటేజ్ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.  అయితే తనను ఇప్పటివరకూ  నడిపించింది తన ప్యాషన్ అని చెప్పాడు.

ఇక గతంలో హీరోయిన్ రెజీనా తో ఎఫైర్ వార్తలు వచ్చాయి కదా అని అడిగితే అవన్నీ రూమర్లని.. రెజినా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. అంతే కాదు. అసలు తను నిజంగా ప్రేమించిన అమ్మాయి పేరు మీడియాలో ఎప్పుడూ రాలేదని.. ఆ అమ్మాయి పేరు తప్ప మిగతా పేర్లన్నీ వచ్చాయని నవ్వేశాడు. కానీ ఆ ప్రేమించిన అమ్మాయి పేరును సందీప్ చెప్పలేదు.  సదరు ఇంటర్వ్యూయర్ కూడా ఆ సంగతి అడగలేదు!  

'నిను వీడని నీడను నేనే' తో సందీప్ మొదటిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు.  సందీప్ కిషన్ ఈ సినిమాతో కార్తీక్ రాజు అనే నూతన దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.  'నిను వీడని నీడను నేనే' ప్రోమోస్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.  మరి ఈ సినిమాతో అయినా సందీప్ కు మంచి విజయం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

    

Tags:    
  • Sundeep Kishan 
  • Ninu Veedani Needanu Nene 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS