• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప' పక్కన చిందులేసే ఆ...

'పుష్ప' పక్కన చిందులేసే ఆ బ్యూటీ ఎవరు...?

By - Tupaki Desk
Update: 2020-08-16 15:00 GMT
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే లెక్కలు వేస్తుంటాడు ఈ లెక్కల మాస్టర్. ఒక్క 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తప్ప సుక్కు ప్రతి సినిమాలో ప్రత్యేక గీతం ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఐటమ్ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంది. ఫస్ట్ సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం'.. జగడం సినిమాలో '36 24 36'.. 'ఆర్య 2' లో 'రింగ రింగా'.. '100% లవ్' లో 'డియాలో డియాలా'.. వన్ నేనొక్కడినే లో 'లండన్ బాబూ లండన్ బాబూ'.. 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా ఈ ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''పుష్ప'' సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ రెడీ చేశాడట దేవీశ్రీ. ఈ సాంగ్ లో ఆడిపాడే ఐటమ్ బాంబ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసాడు సుక్కు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీలో ఎలాగైనా బాలీవుడ్ బ్యూటీని ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఒప్పించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం పూజాహెగ్డే - మలైకా అరోరా - దిశా పటానీ - ఊర్వశి రౌటెలా వంటి హీరోయిన్స్ ని అనుకుంటున్నారని గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా సుక్కు ఈ సినిమాలో 'పుష్ప' పక్కన చిందులేయడానికి స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ను ఒప్పించాలని చూస్తున్నారట. మరి ఈ ఐటమ్ సాంగ్ లో ఏ బ్యూటీ స్టెప్పులేస్తుందో చూడాలి.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa Movie 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS