ఇలాంటి లంబోర్ఘిని టాలీవుడ్ లో ఎవ‌రికి ఉంది!

Update: 2021-04-06 12:45 GMT
ఇటీవ‌లే జాతిర‌త్నాలు ద‌ర్శ‌కుడికి లంబోర్ఘిణి కార్ బొమ్మ‌ను కానుకిచ్చి నిర్మాత‌లు స‌ర్ ప్రైజ్ చేశారు. అయితే అది ఫ‌న్ ఎలిమెంట్ మాత్ర‌మే. ఇప్పుడు రియ‌ల్ లంబోర్ఘిని సొంతం చేసుకుని ఆ యువ‌ హీరో స‌ర్ ప్రైజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ 4.5 కోట్ల రూపాయల విలువైన నల్లని లంబోర్ఘిని ఉరుస్ కార్ ‌ను కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన‌ వీడియోను ఇన్ ‌స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.

కార్తీక్ ఆర్య‌న్ చేజిక్కించుకున్న లంబోర్ఘిణి టాలీవుడ్ లో ఎవ‌రికి ఉంది? అన్న చ‌ర్చా సాగుతోంది. రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌భాస్ లాంటి స్టార్లు ఈ కార్ ని సొంతం చేసుకున్నార‌న్న చ‌ర్చా ఇంత‌కుముందు సాగింది.

బాలీవుడ్ లో ప్ర‌తిభావంతుడైన యువ‌నటుడిగా కార్తీక్ ఆర్య‌న్ ఆర్జ‌న అసాధార‌ణంగా ఉంది. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అత‌డు క్ష‌ణం తీరిక లేనంత బిజీ. జాన్వి కపూర్ తో కలిసి `దోస్తానా 2`నూ న‌టిస్తున్నాడు. అలాగే అత‌డు న‌టించిన‌ ధమాకా డిజిట‌ల్ రిలీజ్ కానుంది.

అలాగే టబు- కియారా అద్వానీ ల‌తో క‌లిసి హారర్-కామెడీ చిత్రం భూల్ భూలైయా 2 లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2007 చిత్రం భూల్ భూలైయా కి సీక్వెల్. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ ఏడాది నవంబర్ లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.
Tags:    

Similar News