ప్రేక్షకుడికి ప్రీమియం సినిమా ఎక్స్పీరియన్స్ .. సరికొత్త ఫీచర్స్ తో ఏఎంబి సినిమాస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరొకవైపు మల్టీప్లెక్స్ బిజినెస్ ను పరుగులు పెట్టిస్తున్నారు.. ముఖ్యంగా మల్టీప్లెక్స్ చైన్ ని విస్తరిస్తున్న మహేష్ బాబు.. బిజినెస్ స్కెచ్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు.;

Update: 2026-02-17 09:38 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరొకవైపు మల్టీప్లెక్స్ బిజినెస్ ను పరుగులు పెట్టిస్తున్నారు.. ముఖ్యంగా మల్టీప్లెక్స్ చైన్ ని విస్తరిస్తున్న మహేష్ బాబు.. బిజినెస్ స్కెచ్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పటికే ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి ఏఎంబి బ్రాండ్ ను క్రియేట్ చేసిన మహేష్ బాబు.. దీనిని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డ విషయం తెలిసిందే.. అలా ఒకవైపు దేశంలోనే పలు ప్రధాన నగరాలలో ఏఎంబి మాల్స్ ను ఏర్పాటు చేస్తూనే.. ఇప్పుడు హైదరాబాదులోని సినీ ప్రేక్షకుడికి ప్రీమియం సినిమా ఎక్స్పీరియన్స్ అందించడానికి ఒక అడుగు ముందుకు వేశారు.

విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు తొలి ప్రయత్నంగా హైదరాబాదులోని గచ్చిబౌలి ఏరియాలో ఏఎంబి సినిమాలు పేరుతో తొలి మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అది ఐటి కారిడార్ కి అత్యంత సమీపంలో ఉండడం, పైగా లగ్జరీ జనావాసాల మధ్య ఉండడంతో దీనికి ప్రేక్షకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇక్కడ పలు బ్రాండ్లకు సంబంధించిన రెస్టారెంట్స్, క్లాతింగ్ షో రూమ్స్ వంటి వివిధ మినీ షోరూమ్స్ కూడా ఉండడంతో వీకెండ్స్ లో ప్రేక్షకులు ఇక్కడికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే హకీంపేట్ ,ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రెండు థియేటర్లను మొదలుపెట్టారు కూడా..

ప్రస్తుతం కన్స్ట్రక్షన్ దశలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ త్వరలోనే ప్రారంభం కానుంది.. దీనికి తోడు అటు బెంగళూరులోనూ కపాలి థియేటర్ ప్రాంగణంలో ఏఎంబి సినిమాస్ కపాలీ థియేటర్ ను జనవరి 16న లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇదే తరహాలో చెన్నైలో కూడా ఒక భారీ స్థాయిలో మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో పాటు గోవాకి కూడా తన మల్టీప్లెక్స్ థియేటర్ చైన్ ను విస్తరించే పనిలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. హైదరాబాదులో తెలుగు సినిమా ప్రియులు అత్యధికంగా ఉన్నా.. నగరంలో తగినంత బలమైన ప్రొజెక్షన్ సౌకర్యాలు లేవు. కాబట్టి హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు ప్రీమియం సినిమా అనుభవాన్ని అందించడానికి ఏఎంబి సినిమాస్లో భారీ ప్రీమియం ఫార్మాట్ అప్డేట్ జరుగుతోంది. ఇది హైదరాబాదులోని థియేటర్ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. స్క్రీన్-1లో సరికొత్త బార్కో 4K లేజర్ HDR ప్రొజెక్టర్ రాబోతోంది. ఇక ఇది సాధారణ ప్రొజెక్టర్ అనుకుంటే పొరపాటే, ఇది డీపర్ బ్లాక్స్, బ్రైటర్ హైలైట్స్ మరియు అల్ట్రా షార్ప్ రిజల్యూషన్‌తో ప్రతి సీన్‌ను కళ్లముందు కదలాడే నిజంలా చూపిస్తుంది.

మార్చి 19 నుంచి టాక్సిక్ మరియు ధురంధర్ 2 వంటి భారీ చిత్రాలను ఈ హై-క్వాలిటీలో చూడటం మనకు ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇక కేవలం స్క్రీన్-1 మాత్రమే కాదు, స్క్రీన్-4లో అల్ట్రా 4DX టెక్నాలజీతో సినిమా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఇక స్క్రీన్ వన్ అప్గ్రేడ్ పూర్తయిన వెంటనే స్క్రీన్ 4పనులు కూడా ప్రారంభం అవుతాయట. మొత్తానికైతే హైదరాబాద్ సినీ ప్రేమికులు ప్రీమియం సినిమా యొక్క సరికొత్త శకాన్ని చూడబోతున్నారని చెప్పవచ్చు. పైగా మార్చి 19 నాటికి పనులన్నీ పూర్తయి, టాక్సిక్.. దురంధర 2 సినిమాలు ఈ థియేటర్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News