• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `సాహో`కి నం.2 స్థానం...

`సాహో`కి నం.2 స్థానం ఖాయ‌మైన‌ట్టే.. నం.1కి ఛాన్స్‌?

By - Tupaki Desk
Update: 2019-08-29 13:31 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ త‌న రికార్డుల్ని తానే బ్రేక్ చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే అంచ‌నా వేస్తోంది ట్రేడ్. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో ఏ రికార్డు చూసినా `బాహుబ‌లి 2` పేరిట నిక్షిప్త‌మై ఉంది. ఇప్పుడు ఆ రికార్డుల్ని చాలా వ‌ర‌కూ సాహో వేటాడ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే అన్నిచోట్లా బ్రేక్ చేస్తుందా? అంటే అవున‌ని చెప్ప‌లేం. అలాగ‌ని కాద‌ని చెప్ప‌లేం. ఓపెనింగ్ డే.. ఓపెనింగ్ వీకెండ్ రికార్డుల్ని సాహో చాలా వ‌ర‌కూ బ్రేక్ చేసే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అస‌లు ఈ రికార్డుల్ని ఏఏ ప్ర‌మాణాల్లో చూస్తారు? అంటే.. ఎంజీలు(మినిమం గ్యారెంటీ)- ఎస్‌.జీ (షేర్ గ్యారెంటీ)లు- హైర్స్ (ఆల్రెడీ వచ్చిన‌వి) వ‌గైరా ప‌రిశీలించి ఈ అంచ‌నాకి వ‌స్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌రిశీలిస్తే తెలుగు వెర్ష‌న్ - హిందీ వెర్ష‌న్ ప‌రంగా నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో సాహో సంచ‌ల‌నాలు ఖాయ‌మైన‌ట్టే. ఇండియా వైడ్ ఈ రెండు వెర్ష‌న్ల‌తో భారీ రేంజు క‌లెక్ష‌న్స్ రానున్నాయి. ఇక సాహో ఫైనల్ క‌లెక్ష‌న్స్ రేంజును డిసైడ్ చేసేది హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద డే వ‌న్ ఎంత వ‌సూలు చేసింది? అన్న‌దానిపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌లో.. బాహుబ‌లి 2- 124 కోట్ల నెట్ .. 2.0 - 59 కోట్ల నెట్.. అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్- 53.10 కోట్ల నెట్.. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్- 52.25 కోట్ల నెట్.. క‌బాలి-47.4 కోట్ల నెట్ తో తొలిరోజు ఇండియా వైడ్ టాప్ 5లో నిలిచాయి. అయితే `సాహో` వీటిలో ఇప్ప‌టికే టాప్ 2 పొజిష‌న్ ఖాయం చేసుకునే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అది క్రాస్ చేసి బాహుబ‌లి 2 రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప‌రిశీలిస్తే.. బాహుబ‌లి 2 దాదాపు 42.47 కోట్ల వ‌సూళ్ల‌తో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఆ త‌ర్వాత అజ్ఞాత‌వాసి- 27 కోట్లు.. అర‌వింద స‌మేత -26 కోట్లు వ‌సూలు చేసి టాప్ 2,3 స్థానాల్లో నిలిచాయి. వారం ముందే అంచ‌నాల ప్ర‌కారం.. సాహో హిందీలో 30 కోట్ల పైగా నెట్ వ‌సూలు చేయ‌నుంద‌ని ఓ అంచ‌నా. త‌మిళంలో.. తెలుగులో బాహుబ‌లి2 డే వ‌న్ రికార్డుల్ని సాహో బీట్ చేయ‌నుంద‌ని అంచ‌నా. ప్రీమియ‌ర్ల‌తోనే అమెరికాలో `సాహో` 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను అధిగ‌మించ‌నుంద‌ని తెలుస్తోంది. దీంతో సాహో రియాలిటీ ఏమిటి అనేది ముందే బ‌య‌ట‌కు తేలిన‌ట్టే. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగుల్లోనే బాహుబ‌లి 2ని అధిగ‌మిస్తుంద‌ని భావిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఈ ఫీట్ ఇప్ప‌టికే అయిన బుకింగ్స్ తోనే సాధ్య‌మైంది. టాప్ 2 ఓపెనింగ్ డే సినిమాగా గ్యారెంటీ వ‌చ్చేసింది. అయితే ఓవ‌రాల్ క‌లెక్ష‌న్ల‌లో టాప్ వ‌న్ స్థానంలో ఉంటుందా లేదా? అన్న‌ది కాస్త వేచి చూడాలి.


Tags:    
  • Saaho 
  • Opening Day Collections 
  • Prabhas 
  • Latest News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS