ఆ స్టార్ డైరెక్టర్ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు...?

Update: 2020-04-25 00:30 GMT
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ సాధించడం చాలా కష్టం. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది తమ అరంగేట్రంలో బ్లాక్ బస్టర్స్ సాధించి తరువాత రోజుల్లో సినీ పరిశ్రమ నుండి అదృశ్యమైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి గాడ్ ఫాదర్ సహాయం లేకుండా సక్సెస్ అయిన ఇద్దరు ఈ జెనరేషన్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ కెరీర్ స్టార్టింగ్ నుంచి అందరిని ఆకట్టుకునేలా ఎవరి స్టైల్లో వారు కష్టపడి.. స్టార్ హీరోల రేంజ్ లో వారికంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. జయపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ స్టార్స్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేయడానిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇప్పటికే వీరిలో ఒకరు ఒక స్టార్ డైరెక్టర్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ మధ్య వీరిద్దరూ ఒక స్టార్ డైరెక్టర్ మెప్పు పొందానికి ట్రై చేస్తున్నారట. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్లాప్ సినిమా అంటే ఏంటో తెలియని ఆ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఒక స్టార్ హీరో నటించే క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఆ సినిమా తరువాత ఆ డైరెక్టర్ స్టార్ హీరోలతో కాకుండా నేటితరం యంగ్ హీరోలతో వర్క్ చేయాలని ఆలోచిస్తున్నాడట. కొన్ని సినిమాలు తీసి రిటైర్ అవ్వాలని భావిస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ మీడియం రేంజ్ హీరోలతో కూడా సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే కొన్ని కథలను రెడీ చేసుకున్న ఆ డైరెక్టర్.. కమర్షియల్ గా కాకుండా నేటి యువతరానికి నచ్చేలా రొమాంటిక్ అండ్ ఎమోషనల్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట. ఆ కొత్త కథల కోసం హీరోలను వెతుకుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడి కన్ను ఈ ఇద్దరు యంగ్ హీరోలపై పడ్డట్లు ఇండస్ట్రీలో టాక్. ఆ స్టార్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాలో ఈ ఇద్దరి హీరోల్లో ఎవరినో ఒకరిని సెలక్ట్ చేసే అవకాశం ఉందట. ఈ కాంబినేషన్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ డైరెక్టర్ మల్టీస్టారర్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ సినిమాలో ఈ ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించే ఛాన్స్ ఉందని కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ ప్రస్తుతం ఆ డైరెక్టర్ కి అలాంటి ఆలోచన లేదంట. లాక్ డౌన్ లో ప్రస్తుతం కొత్త తరహా కథలకు పదును పెడుతున్న ఆ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్.. ఒకవేళ పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైనా కూడా ప్రెజెంట్ చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక ఎనౌన్స్ చేస్తారట. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ స్టార్ డైరెక్టర్ ఒక సినిమా అయిపోయిన తరువాతే మరొక సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో వెళ్లాలని అనుకుంటున్నాడట. ఆ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఈ ఇద్దరి యువ హీరోల్లో ఎవరికి దక్కుతుందనే విషయం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఆ స్టార్ డైరెక్టర్ వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోగా మారుస్తాడో చూడాలి.


Tags:    

Similar News