• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుస పెట్టి ఓకే చెప్పేయటం...

వరుస పెట్టి ఓకే చెప్పేయటం సరే.. రిలీజ్ లు ఎప్పుడు డార్లింగ్?

By - Tupaki Desk
Update: 2021-07-06 04:30 GMT
మిగిలిన రంగాలకు సినిమా రంగానికి ఉన్న తేడా ఒక్కటే. ఒక్క సినిమా చాలు.. మొత్తం ఇమేజ్ మారిపోవటానికి. బాహుబలి మూవీతో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఎంతలా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుబలి కోసం ఏళ్లకు ఏళ్లు ఖర్చు పెట్టిన దానికి తగ్గట్లే.. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోవటమే కాదు.. అతడి మార్కెట్ అంచనాలకు మించిపోయింది.

ఇదంతా బాగానే ఉన్నా.. ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలయ్యేది ఎప్పుడని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఆయన నటించిన రాధే శ్యామ్ ఈ నెలఖారున విడుదల కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సి ఉన్నా.. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారన్న దాని మీద క్లారిటీ లేకపోవటం.. ఒకవేళ తెరిచినా.. ఆ వెంటనే ఇంత భారీ మూవీని థియేటర్లకు తెచ్చే సాహసం నిర్మాత హీరోలు చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.

మోస్ట్ ఎవైటింగ్ మూవీల్లో ఒకటిగా రాధే శ్యామ్ చెప్పాలి. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్నప్రశాంత్ నీల్ ‘సలార్’ రెండు పార్టులు విడుదల కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తుంటే.. సీతగా కృతి సనన్, దశరధుడిగా కృష్ణంరాజు నటిస్తున్నారు. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్నిఇన్ని కావు. ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేని సబ్జెక్టులు ఎంచుకుంటున్న ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు మరికొన్ని ఉన్నాయి.

బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఒక మూవీకి డార్లింగ్ ఓకే చెప్పేయటం తెలిసిందే. ప్రస్తుతం ఆ దర్శకుడు షారూక్ ఖాన్ తో పఠాన్ మూవీని.. ’.. హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ సినిమాను చేస్తున్నారు. ఈ రెండుచిత్రాల తర్వాత ప్రభాస్ తో చేసే సినిమా ఉంటుందని చెబుతున్నారు. అనుకోని రీతిలో ప్రభాస్ తో సినిమాకు సుధ కొంగర గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఈ మూవీ బయోపిక్ ఉంటుందని చెబుతున్నారు.

ఇలా పలు క్రేజీ ప్రాజెక్టులకు ప్రభాస్ ఓకే చెప్పారు. ఇదిలాఉంటే.. ప్రభాస్ తో నాగ్ ఆశ్విన్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ దానికి ముడి పడటం లేదు. వాస్తవానికి సలార్ తర్వాత అతని సినిమా ఉంటుందన్న టాక్ కు భిన్నంగా తాజాగా కొత్త మాట వినిపిస్తోంది. ప్రభాస్ చేసే సిల్వర్ జూబ్లీ మూవీ (25వ సినిమా)కి నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు.

మరే హీరోకు లేనట్లుగా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టుల్ని చేస్తున్నా.. తమ అభిమాన హీరో మూవీ చూడటానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే.. ఒక్క సినిమా రిలీజ్ కావటం మొదలైతే.. మిగిలినవన్నీ వరుస పెట్టి వచ్చేస్తాయంటున్నారు. ఇంతకీ రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడన్న దానిపై ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    
  • prabhas 
  • salaar 
  • adipurush 
  • radhe shyam 
  • prabhas upcoming movies 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS