ఏంటీ.. ఆ సినిమా యాంటీ క్లైమాక్స్ తో తెరకెక్కిందా..?
కొన్ని సినిమాలకు యాంటీ క్లైమాక్స్ అనేది వర్కౌటై మూవీ సూపర్ హిట్ అవడానికి కారణమైతే.. మరికొన్నిటికి అదే మైనస్ గా మారి ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. దర్శకులు కథ రీత్యా చివర్లో హీరోని చంపేయడం లేదా హీరోయిన్ ని చంపడం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే.. త్వరలో రిలీజ్ కాబోతున్న ఓ సినిమాకి అలాంటి యాంటీ క్లైమాక్స్ నే ప్లాన్ చేసారని తెలిసింది. హీరో హీరోయిన్స్ సినిమా ఎండింగ్ లో చనిపోవడం మనం చాలా సినిమాల్లో చూసేశాం. కాకపోతే ఈ సినిమాలో హీరో చేతిలోనే హీరోయిన్ చనిపోవడం అసలు ట్విస్ట్ అని అంటున్నారు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఒకరు ఇద్దరు టాలెంటెడ్ హీరో హీరోయిన్లతో ఓ వైవిధ్యమైన సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ చిత్రం పైనే ఉంది. ఫిల్మ్ నగర్ లో ఎక్కడికెళ్లి ఈ సినిమా గురించి మాట్లాడినా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఈ కథలో మెయిన్ అట్రాక్షన్ అయిన హీరోయిన్ పాత్ర క్లైమాక్స్ లో హీరో చేతిలో చనిపోతుందట. ఆమె చనిపోయే సన్నివేశం చాలా ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. ఇది సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈ యాంటీ క్లైమాక్స్ అనేది ఆడియెన్స్ కి ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.