కరోనా ఎఫెక్ట్ వాళ్లపైనే ఎక్కువగా పడనుందా..?

Update: 2020-03-23 09:31 GMT
కరోనా మహమ్మారి ప్రభావం వలన నష్టపోయిన రంగాలలో సినీ రంగం ఒకటి. సినీరంగం అంటేనే కొన్ని కోట్లతో కూడుకున్న వ్యాపారం. యాంత్రిక జీవితాలకు అలవాటుపడిన ఈ జనరేషన్ వాళ్ళకి ముఖ్యమైన ఎంటర్టైన్మెంట్ సాధనం 'సినిమా'. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేయడంతో సినీ అభిమానులు వీటికి దూరమైన సంగతి తెలిసిందే. కోవిడ్-19గా పిలవబడుతున్న ఈ మహమ్మారి సృష్టించిన అలజడి వలన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమని శాసిస్తున్న 'ఆ నలుగురి' పరిస్థితి ఏంటి అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ లో 'ఆ నలుగురు' అనే పదం రెగ్యులర్ గా వినబడుతూ ఉంటుంది. థియేటర్లను గుప్పిట్లో పెట్టుకొని టాలీవుడ్ ని శాసిస్తుంది 'ఆ నలుగురే' అంటూ, థియేటర్లు దొరకని చిన్న నిర్మాతలు..చిన్న సినిమాలను చంపేస్తుంది 'ఆ నలుగురే' అంటూ కామెంట్స్ చేయడం మనం వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎక్కువగా నష్ట పోయింది కూడా ఆ నలుగురేనట.

సినీ ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకొని తాము ఆడిందే ఆట, పాడిందే పాట అంటూ ఇంతకాలం కొనసాగించిన ఆ నలుగురు బడా నిర్మాతలకు కరోనా వల్ల కొన్ని కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కరోనా వాళ్ళ ఈ నెల 31 వరకూ థియేటర్లను బంద్ చేయాలని టాలీవుడ్ పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. థియేటర్లు మూసివేయడంతో పాటు సినీ పరిశ్రమలోని అన్ని సెక్టార్లు పనిచేయకపోవడం వల్ల ఈ నలుగురు నిర్మాతలపై ఎక్కువ ఎఫెక్ట్ పడేలా ఉంది. థియేటర్స్ మూసివేయడం వల్ల సాధారణంగా ఎగ్జిబిటర్ - డిస్ట్రిబ్యూటర్- నిర్మాత ఈ ముగ్గురిపై ప్రభావం పడుతుంది. థియేటర్స్ వలన ఈ నెలలో ఎలాంటి ఆదాయం ఉండదు పైగా థియేటర్ లీజులు, మైంటైనెన్సు ఖర్చులు ఇలా చెప్పుకుంటూపోతే ఈ ఖర్చులన్నీ ఈ నలుగురు బడా నిర్మాతలపైనే భారం మొత్తం పడుతుంది. వీటి నుండి వీళ్ళు ఎలా బయట పడతారో చూడాలి మరి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి వలన సినీ పరిశ్రమ కొన్ని వేల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Tags:    

Similar News