• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుష్ 'జగమే తంత్రం'...

ధనుష్ 'జగమే తంత్రం' అప్డేట్ ఏంటి.. అసలు విడుదల అవుద్దా??

By - Tupaki Desk
Update: 2021-01-19 11:11 GMT
తమిళ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా ‘జగమే తంతిరమ్‌’. ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. గతేడాది వేసవిలోనే సినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ధనుష్‌ డిఫరెంట్‌ గెటప్‌లో దర్శనమిచ్చాడు. చొక్కా, పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులతో కాస్త మాస్ గానే ఉన్నాడు. అలాగే సినిమా నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే హీరో ధనుష్‌కు ఇది 40వ సినిమా కావడం విశేషం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గతేడాదిలోనే వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి చాలారోజులు అవుతున్నా ఇంతవరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దర్శకనిర్మాతలు.

ఆ మధ్యలో సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తామని వార్తలు వినిపించాయి. కానీ చివరికి సినిమాను థియేటర్స్ లోనే ఓపెన్ అయ్యాక థియేట్రికల్ రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. మరి ఇప్పటికే సినిమా థియేటర్లు తెరుచుకొని సినిమాలు కూడా ఆడుతున్నాయి. కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే లిరికల్ సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్ సినిమా ఆలస్యం వెనుక కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఇక ఎలాంటి డబ్బింగ్ సినిమాకైనా తెలుగు రాష్ట్రాలలో ఇట్టే థియేటర్లు దొరికేస్తుంటాయి. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది కాబట్టి మాస్టర్ సినిమాను భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు. మరి విడుదలకు రెడీగా ఉన్న ధనుష్ జగమే తంత్రం మూవీకి థియేటర్లు దొరకవని భావిస్తున్నారా.. లేక వేరే ఏదైనా కారణం ఉందా..? ఇప్పటికే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో జనాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది.
Tags:    
  • jagame thanthiram 
  • jagame thanthiram Release Date 
  • Dhanush jagame thanthiram 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS