#SUMMER టాలీవుడ్ లో క‌రోనా భ‌యాలు ఏమేర‌కు?

Update: 2021-04-06 01:30 GMT
ముంబై మ‌హారాష్ట్ర‌లో వీకెండ్స్ వ‌ర‌కూ థియేట‌ర్లు బంద్ చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కేసులు పెర‌గ‌డంతో మ‌హా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌య‌మిది. దేశంలో 50శాతం కేసులు మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌వుతుండ‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌ర్నాట‌క‌లోనూ స‌మస్యాత్మ‌కంగానే ఉందన్న రిపోర్టులు ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి అదుపులో ఉన్నా.. భ‌విష్య‌త్ లో ఎలా ఉండ‌నుంది? అన్న ఆందోళ‌న మ‌న నిర్మాత‌ల్లోనూ ఉంది. ఏప్రిల్ లో ప‌లు క్రేజీ చిత్రాలు వ‌రుస‌గా రిలీజ‌వుతున్నాయి. వీటికి ఎలాంటి ముప్పు లేకుండా స‌జావుగా థియేట్రిక‌ల్ రిలీజ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన వైల్డ్ డాగ్ కి పాజిటివ్ రిపోర్ట్ ద‌క్క‌డం ఉత్సాహం నింపుతోంది. త‌దుప‌రి వ‌కీల్ సాబ్-ల‌వ్ స్టోరి లాంటి చిత్రాలు పెద్ద విజ‌యం అందుకుంటాయ‌ని థియేట‌ర్ల‌కు జ‌నాల్ని ర‌ప్పిస్తాయ‌ని భావిస్తున్నారు. దీనికోసం థియేట‌ర్ల‌లో త‌గు ప్రోటోకాల్ పాటించి స‌మ‌స్యాత్మ‌కం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు బాలీవుడ్ లో తాజా స‌న్నివేశంలో చాలా చిత్రాలు వాయిదా ప‌డే ప‌రిస్థితి ఉంది. అయితే ఏప్రిల్ అనంత‌రం మేలో ప‌రిస్థితి ఎలా ఉండ‌నుంది?  తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా భ‌యాలు త‌గ్గుతాయా లేదా? అన్న‌దానిపైనా చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే మేలో వ‌రుస‌గా భారీ చిత్రాలు రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇందులో మెగాస్టార్  చిరంజీవి-రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొర‌టాల తెర‌కెక్కిస్తున్న ఆచార్య పై బిగ్ బెట్టింగ్ న‌డుస్తోంది. ఆ క్ర‌మంలోనే డిస్ట్రిబ్యూట‌ర్లు బ‌య్య‌ర్ల‌లోనూ భ‌యాలు నెల‌కొన్నాయ‌ట‌.  

విక్ట‌రీ వెంక‌టేష్ - నారప్ప..బాల‌య్య‌-బోయ‌పాటిల బీబీ3.. ర‌వితే-ఖిలాడీ..  ఇత‌ర చిత్రాలు రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇవ‌న్నీ క్రేజీ గా రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌వే. వీటిపై పంపిణీదారులు భారీగానే పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లుతున్నారు. అయితే జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే కోవిడ్ భ‌యాలు పూర్తిగా తొల‌గిపోవాల్సి ఉంటుంది.

పాజిటివ్ అంశాల్ని ప‌రిశీలిస్తే.. ఇప్ప‌టికి వ్యాక్సినేష‌న్ బాగానే సాగుతోంది. టీకాలు స‌మృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. ఆస్ప‌త్రుల్లో ప‌రిస్థితి అదుపులోనే ఉంది.  పైగా ఇరువురు ముఖ్య‌మంత్రులు థియేట‌ర్ల‌ను బంద్ చేయ‌కుండా ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌హ‌క‌రిస్తున్నారు. అందువ‌ల్ల తెలుగు రాష్ట్రాల వర‌కూ ఆశావ‌హం. ఇక అమెరికాలోనూ ప‌రిస్థితి నెమ్మ‌దిగా అదుపులోకి వ‌స్తున్న వైనం క‌నిపిస్తుంటే అక్కడా థియేట‌ర్లు తెరిచే వీలుంటుంది. తెలుగు రాష్ట్రాలు- అమెరికా మార్కెట్ ఆశావ‌హంగా ఉంటే ఆ మేర‌కు తెలుగు సినిమా గ‌ట్టెక్కే వీలుంద‌న్న ఆశ స‌జీవంగానే ఉంది.
Tags:    

Similar News