నందమూరి వారి ఇంట పెళ్లి సందడి

Update: 2020-12-19 09:44 GMT
మొన్నటి వరకు మెగా వారి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో హల్ చల్‌ చేశాయి. మెగా బ్రదర్‌ నాగబాబు తన కూతురు నిహారిక వివాహంను వైభవంగా నిర్వహించాడు. పెళ్లి తంతు ఇటీవలే పూర్తి అయ్యింది. మెగా వారి పెళ్లి హడావుడి పూర్తి అయ్యిందో లేదో సోషల్‌ మీడియాలో నందమూరి వారి పెళ్లి సందడికి సంబంధించిన ఫొటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. నందమూరి ఫ్యామిలీకి చెందిన చైతన్య కృష్ణ వివాహం తాజాగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నందమూరి హీరోలు ఇతర కుటుంబ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు.

చైతన్య కృష్ణ హీరోగా తెలుగులో ఒక సినిమాను చేశాడు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. వ్యాపారాలతో బిజీగా ఉన్న చైతన్య కృష్ణ నిన్న రేఖారాణి మెడలో మూడు ముళ్లు వేశారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ మద్యలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్‌ పెళ్లికి హాజరు అయ్యాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కళ్యాణ్‌ రామ్‌ హాజరు అవ్వడంతో ఎన్టీఆర్‌ కూడా హాజరు అయ్యే ఉంటాడు. కాని ఫొటోలు బయటకు రాలేదు అంటున్నారు. నందమూరి బాలకృష్ణ దంపతులు మరియు ఆయన కూతురు మరియు అల్లుడు ఇంకా ఆ కుటుంబ పెద్దలు పిల్లుల అంతా హాజరు అయ్యారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News