భర్త గురించి ఒక్క మాటతో తేల్చేసిన సామ్
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పర్సనల్ గానే కాకుండా ప్రొఫెషనల్ పరంగా కూడా పవర్ ఫుల్ కపుల్ గా నిలుస్తున్నారు.;
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పర్సనల్ గానే కాకుండా ప్రొఫెషనల్ పరంగా కూడా పవర్ ఫుల్ కపుల్ గా నిలుస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీసులతో ఇప్పటికే తమ కెమిస్ట్రీని ప్రూవ్ చేసుకున్న ఆ ఇద్దరూ, తాజాగా మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచారు. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ఆ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతతో పాటు రాజ్, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మించడం విశేషం. అంటే ఆ ప్రాజెక్టులో సమంత, రాజ్ ఇద్దరూ యాక్షన్- ప్రొడక్షన్ రూపంలో కలిసి పనిచేస్తున్నారు. అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోలో సమంత, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ చిట్ చాట్ వైరల్ గా మారింది.
అందులో ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉంటారు? అన్న వెన్నెల కిషోర్ ప్రశ్నకు సమంత ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. "రాజ్ చాలా గ్రేట్… ఆయన ఓ క్రియేటర్" అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. ఆ మాటల ద్వారా వారి మధ్య ఉన్న అర్థం చేసుకోవడం, గౌరవం క్లియర్ గా కనిపించింది. కానీ సామ్ చెబుతుండగా.. వెన్నెల కిషోర్ మరో క్వశ్చన్ అడిగేశారు.
ఇక సమంత- రాజ్ జంటకు ఇది మొదటి కలయిక కాదు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా వీరి కాంబినేషన్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ సిరీస్ లో సమంత నటనకు ప్రశంసలు లభించగా, రాజ్ తన డైరెక్షన్ టాలెంట్ తో ఆకట్టుకున్నారు. సిటాడెల్: హనీ బన్నీ వంటి భారీ ప్రాజెక్ట్ లో కలిసి వర్క్ చేసి ఇండియన్ ఓటీటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
అయితే ఆ జంట గత ఏడాది కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లో సమంత, రాజ్ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వేడుకలో ఆ జంట ఎంతో సింపుల్ గా, అందంగా కనిపించారు. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ చిత్రంలో సమంత స్ట్రాంగ్ ఉమెన్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాకు కథ, నిర్మాణ పరంగా కూడా రాజ్ నిడిమోరు భాగస్వామ్యం ఉండటం విశేషం. అంటే ఆయన క్రియేటివ్ ఇన్ పుట్ కూడా ఉన్నట్లే. ఏదేమైనా సమంత- రాజ్ ప్రస్తుతం పర్సనల్ గా, ప్రొఫెషన్ పరంగా మంచి ఫేజ్‌లో ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ తో పేరు తెచ్చుకున్న ఆ కపుల్.. మా ఇంటి బంగారంతో మరో హిట్ అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.