బాలీవుడ్ డెబ్యూ టెన్ష‌న్ లో సాయి ప‌ల్ల‌వి.. అదొక్క‌టే కాపాడాలి

రిలీజ్‌కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండగా, సినిమా చుట్టూ కనిపిస్తున్న సైలెన్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-04-27 05:31 GMT

సినీ ఇండ‌స్ట్రీలో ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ సమీకరణాలు మారిపోతుంటాయి. భారీ ప్రమోషన్స్, స్టార్ పవర్, సోషల్ మీడియా హైప్ ఇవ‌న్నీ ఒక సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అన్ని అంశాలను మించి పనిచేసేది ఒకటే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు ఏక్ దిన్ సినిమా పరిస్థితి కూడా ఇదే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. రిలీజ్‌కు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండగా, సినిమా చుట్టూ కనిపిస్తున్న సైలెన్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ ప్రారంభంలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. కానీ టీజర్, ట్రైలర్ తర్వాత ఆ హైప్ క్రమంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కథలో కొత్తదనం లేకపోవడం, ప్రమోషన్స్ దాదాపు కనిపించకపోవడం వంటి అంశాలు మైనస్‌గా మారాయి. ఇదే సమయంలో జునైద్ ఖాన్ కెరీర్‌కు ఇదొక కీల‌క ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై ఉంది. అయినప్పటికీ, రిలీజ్ ముందు కనిపిస్తున్న లో-బజ్ సినిమాకు ఓ రిస్క్ ఫ్యాక్టర్‌గా మారింది.

త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు

అయితే బ‌జ్ లేద‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. గ‌తంలో కొన్ని సినిమాలు ఇలానే సైలెంట్ గా వ‌చ్చి సర్ప్రైజ్ హిట్స్‌గా నిలిచిన సంద‌ర్భాలున్నాయి. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, సినిమాకు ఫ‌స్ట్ షో త‌ర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమాలు స్లో స్టార్ట్ తీసుకుని, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా బాక్సాఫీస్ వద్ద బలమైన స్థాయికి చేరుకున్నాయి. అదే ఫార్ములా ఇక్కడ కూడా పని చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కంటెంట్ పైనే ఆశ‌లు

కానీ అలా జర‌గాలంటే సినిమాలో కంటెంట్ అంద‌రినీ మెప్పించేదిగా ఉండాలి. ఒక సినిమా నిజంగా ప్రేక్షకుల హృదయాలను తాకగలిగితే, ప్రీ-రిలీజ్ హైప్ లేకపోయినా అది నెమ్మదిగా పుంజుకుని స‌క్సెస్ ను అందుకోవచ్చు. అదే సమయంలో కంటెంట్ బలహీనంగా ఉంటే, భారీ ప్రమోషన్స్ ఉన్నా కూడా ఆడియన్స్ దానిని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు మొదటి రోజు కంటే కూడా మొదటి వీకెండ్, ఆ తర్వాత వచ్చే టాక్ కీలకంగా మారబోతోంది.

సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ జ‌ర్నీపై ప్ర‌భావం

ఇక సాయి పల్లవి ప‌రంగా చూస్తే, ఈ సినిమా ఫలితం ఆమె బాలీవుడ్ ప్రయాణంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా మంచి హిట్ సాధిస్తే, త‌న నెక్ట్స్ ప్రాజెక్టు అయిన రామాయ‌ణకు బాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఆమె నటనకు ఇప్పటికే సౌత్‌లో ఉన్న గుర్తింపు హిందీ ప్రేక్షకుల మధ్య కూడా బలపడే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతే, ఈ డెబ్యూ ప్రాజెక్ట్ ఆమె కెరీర్‌లో ఓ మచ్చగా మిగిలే ప్రమాదం కూడా లేకపోలేదు. మొత్తానికి ప్రీ రిలీజ్ సైలెన్స్ మధ్య, పోస్ట్ రిలీజ్ టాక్ ఎంత బలంగా ఉంటుందో, అదే ఈ సినిమా భవిష్యత్తును నిర్ణయించబోతుంది. మే 1న ఏక్ దిన్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News