ప్రియదర్శి మరో డిఫరెంట్ కాన్సెప్ట్.. హీరోయిన్ ఎవరంటే..

టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ హంగుల కంటే కూడా మట్టి వాసన ఉన్న కథలకే ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు.

Update: 2026-06-19 07:31 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ హంగుల కంటే కూడా మట్టి వాసన ఉన్న కథలకే ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ ను సరిగ్గా క్యాచ్ చేసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వర్క్స్ తో కలిసి ఒక వైవిధ్యమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు వంశీ రెడ్డి ఈ సినిమాతో మెగాఫోన్ పడుతున్నాడు. ఇదొక స్వచ్ఛమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అని అనౌన్స్మెంట్ తోనే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.




 


ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన లేటెస్ట్ వివరాల్లోకి వెళితే.. మేకర్స్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణకు చెందిన పాపులర్ ఫోక్ సింగర్, డాన్సర్ నాగదుర్గను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారట. నల్గొండ ప్రాంతానికి చెందిన ఆమెకు జానపద కళల్లో ఎంతో మంచి పట్టుంది. కేవలం గ్లామరస్ హీరోయిన్స్ ని కాకుండా ఇలాంటి నేచురల్ టాలెంట్ ను వెండితెరకు పరిచయం చేయడం వెనుక దర్శకుడి పక్కా ప్లాన్ కనిపిస్తోంది.

ఇక దర్శకుడు సుకుమార్ సినిమాల్లో క్యారెక్టర్లు చాలా రూటెడ్ గా, రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాలో కూడా కథలోని నేటివిటీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయడం కోసమే నాగదుర్గను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదొక ఎమోషనల్ గా సాగే రూరల్ డ్రామా కావడంతో ఆ వాతావరణానికి, ఆ యాసకు పక్కాగా సరిపోయే అమ్మాయి కావాలనే ఈ సర్ ప్రైజ్ ఛాయిస్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.

ఇక ఈ ప్రాజెక్ట్ లో మరో అతిపెద్ద ప్లస్ పాయింట్ యంగ్ హీరో ప్రియదర్శి. బలగం లాంటి రూటెడ్ విలేజ్ డ్రామాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటూ తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరోసారి ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ ఎమోషనల్ కథతో రాబోతుండటంతో ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.

సుకుమార్ రైటింగ్స్ బ్రాండ్ వాల్యూ ఈ సినిమాకు అతిపెద్ద అండగా నిలవబోతోంది. కుమారి 21ఎఫ్, ఉప్పెన లాంటి సినిమాలతో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టిన అద్భుతమైన ట్రాక్ రికార్డు ఈ బ్యానర్ కు ఉంది. బన్నీ వాస్ లాంటి జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ తోడవ్వడంతో ఈ చిన్న బడ్జెట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీ పరంగా కూడా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. గతంలో కేవలం యూట్యూబ్, సోషల్ మీడియాకే పరిమితమైన జానపద కళాకారులకు ఇప్పుడు నేరుగా వెండితెరపై మెయిన్ లీడ్స్ దొరకడం నిజంగా మంచి విషయమే అని చెప్పాలి. కొత్త డైరెక్టర్ వంశీ రెడ్డి సిద్ధం చేసిన ఈ రా అండ్ రూరల్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News