సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడాలి: సోనాక్షి

Update: 2019-07-25 04:31 GMT
'దబాంగ్' బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఖాన్దాని షఫాఖానా'.   శిల్పిదాస్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ డ్రామా కాస్త అడల్ట్ టచ్ తో సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను నాలుగు రోజుల క్రితం విడుదల చేశారు.  ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సోనాక్షి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సినిమా సెక్స్ ఎడ్యుకేషన్ ప్రధానాంశంగా సాగుతుంది.  అందుకే సోనాక్షి ట్రైలర్ లాంచ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

"మన దేశంలో అన్నీ మాట్లాడతారు కానీ సెక్స్ గురించి మాట్లాడాలంటే చాలు ముడుచుకుపోతారు.  సెక్స్ టాపిక్ మాట్లాడవద్దని అందరికీ ఇంట్లో నూరిపోస్తుంటారు.  మనకు నిజంగా సెక్స్ అంత ఇబ్బందికరమైన అంశం అయితే మన జనాభా ఎందుకు అంత ఎక్కువగా ఉంది?  మన ప్రజలకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం.  అందరికీ అర్థం అయ్యే రీతిలో సెక్స్ పాఠాలు చెప్పాలి" అంటూ సెక్స్ ఎడ్యుకేషన్ అంశంపై తన అభిప్రాయన్ని ఓపెన్ గా చెప్పేసింది.

ఇక సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. కుటుంబ బాధ్యతను స్వీకరించిన సోనాక్షి తన అంకుల్ కు సంబంధించిన సెక్స్ క్లినిక్ ను నడపాల్సి వస్తుంది.  ఈ స్టొరీ జరిగేది పంజాబ్ లోని ఒక టౌన్.  ఇక చూసుకోండి అంతా ఫన్.. సెక్స్  గురించి జనాలు అసలు మాట్లాడరు.. పైగా క్లినిక్ నడిపేది ఒక మహిళ కావడంతో ఆ పేషెంట్లు ఇంకా సిగ్గుపడిపోతుంటారు. ఈ హంగామా మామూలుగా ఉండదు.  దీంతో ఇక లాభం లేదనుకున్న సోనాక్షి సెక్స్ గురించి అందరూ మాట్లాడాలి.. మిగతా ఆరోగ్య సమస్యలు ఎలాగో సెక్స్ గురించి కూడా మాట్లాడాలి అంటూ తన వాదన వినిపిస్తుంది.  అందరి చేత మాట్లాడించాలని ఒక పాప్ సింగర్ బాద్ షా సహాయం తీసుకుంటుంది.

ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.  ఈ సినిమాలో వరుణ్ శర్మ.. అన్ను కపూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ర్యాపర్ బాద్షా ఈ సినిమాలో క్యామియో పాత్ర పోషించారు. టీ-సీరీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Full View
Tags:    

Similar News