'దురంధ‌ర్' భ‌య‌పెడితే 'దురంధర్ 2' హడలెత్తిస్తుంది: ఆర్జీవీ

సెన్సేష‌న్ కోసం ఏదో ఒక‌టి మాట్లాడ‌టం కాదు.. సెన్సిటివిటీస్ ని అర్థం చేసుకుని విశ్లేషించ‌డంలోను ఆర్జీవీ త‌ర్వాతే. ఇప్పుడు ఆయన 'దురంధ‌ర్' సినిమాని మ‌హాభార‌తంతో పోల్చే ప్ర‌య‌త్నం చేసారు.;

Update: 2026-01-01 12:43 GMT

సెన్సేష‌న్ కోసం ఏదో ఒక‌టి మాట్లాడ‌టం కాదు.. సెన్సిటివిటీస్ ని అర్థం చేసుకుని విశ్లేషించ‌డంలోను ఆర్జీవీ త‌ర్వాతే. ఇప్పుడు ఆయన 'దురంధ‌ర్' సినిమాని మ‌హాభార‌తంతో పోల్చే ప్ర‌య‌త్నం చేసారు. ఎగ్జాక్ట్ గా మ‌హాభార‌తం కాదు కానీ, తాజా ఇంటర్వ్యూలో, ఆర్‌జివి ధురంధర్ కి -మహాభారతానికి మధ్య ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు.

'దురంధ‌ర్' నిజ జీవితంలోని పాత్ర‌ల‌కు మ‌హాభార‌తంలోని పాత్ర‌ల‌కు మ‌ధ్య‌లో ఉంటుంద‌ని ఆర్జీవీ అన్నారు. ఇందులో బాబు డెకాయిత్ పాత్ర క‌నిపించింది కేవ‌లం 20 నిమిషాలే అయినా బ‌ల‌మైన ముద్ర వేసింద‌ని అన్నారు. బాబు డెకాయిత్ లాంటి వ్యక్తిని పెద్ద అక్షరాలతో, నేపథ్య సంగీతంతో పరిచయం చేసినప్పుడు, అతడు ఏం చేస్తాడో మీకు తెలియకపోయినా, అది మానసికంగా ఆ వ్యక్తిపై ఒక రకమైన ఉత్సుకతను పెంచుతుంది. దాదాపు ప్రతి పాత్ర విషయంలోనూ వారు ఇదే చేశారు.. హింస మానసిక క్రీడ అని నేను చెప్పింది దాని గురించే.. డెకాయిత్ అనే పదమే దానికి నిదర్శనం.. ఆ వ్యక్తి నా మనసులో చెరగని ముద్ర వేశాడు. అతడు బహుశా 20 నిమిషాలు కూడా సినిమాలో లేడు.. కానీ నేను బాబు డకాయిత్ ముఖాన్ని మర్చిపోలేను. మహాభారతం అని నేను చెప్పింది దీని గురించే. నా దృష్టిలో ఇది చాలా వాస్తవికమైన మహాభారతం. ధురంధర్ సినిమా కథాంశం అదే'' అని అన్నారు.

దురంధ‌ర్ సినిమా భ‌య‌పెడితే, దురంధ‌ర్ 2 హ‌డ‌లెత్తిస్తుంద‌ని ఆర్జీవీ విశ్లేషించారు. ఆదిత్యా ధ‌ర్ ప్ర‌తిభ గురించి చాలా సేపు ఈ ఇంట‌ర్వ్యూలో కొనియాడిన ఆర్జీవీ, తాను అత‌డితో ఫోన్ లో మాట్లాడి విష్ చేసాన‌ని, అయితే ఆ స‌మ‌యంలో అత‌డి విన‌యం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని అన్నారు. ద‌ర్శ‌క‌త్వంలోనే కాదు విన‌య‌విధేయ‌త‌ల్లోను ఆదిత్య ఒదిగి ఉండే శైలిని ఆర్జీవీ ప్ర‌శంసించారు. అలా మాట్లాడే వ్యక్తిని నేను ఇంతకు ముందు ఎవరినీ చూడలేదు. ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు.. ఆదిత్య త‌న టీమ్ కి ఎలా క్రెడిట్ ఇచ్చాడో కూడా ఆర్జీవీ తెలిపారు.

సాధార‌ణంగా వేదిక‌ల‌పై మాత్ర‌మే ముఖ‌స్తుతి కోసం ఇలా టీమ్ మెంబ‌ర్స్ గొప్ప‌త‌నం గురించి మాట్లాడ‌తారు. ఫోన్ లో మాట్లాడిన‌ప్పుడు ఎవ‌రైనా త‌న గురించి గొప్ప‌ల‌కు పోతారు. కానీ ఆదిత్య అలా కాదు. త‌న సంగీత ద‌ర్శ‌కుడు.. ఎడిట‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్, న‌టీన‌టులు అంద‌రికీ క్రెడిట్ ఇచ్చారు. ఈ సినిమాకి తాను ఏమీ చేయ‌లేద‌ని మాట్లాడారు. అలాంటి కాన్ఫిడెన్స్ న‌మ్మ‌కం ఆదిత్య లాంటి వ్య‌క్తికే సాధ్య‌మ‌ని పొగిడేసారు. త‌న స‌హాయ ద‌ర్శ‌కుడి గొప్ప‌త‌నం గురించి చెప్పేందుకు ఆదిత్యా ధ‌ర్ నేరుగా దురంధ‌ర్ ట్రైల‌ర్ వేడుక‌లో వేదిక‌పైకి వ‌చ్చిన విష‌యాన్ని ఆర్జీవీ మాట్లాడారు. దురంధ‌ర్ 2 అసాధార‌ణ విజ‌యం సాధిస్తుంద‌ని కూడా ఆర్జీవీ న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు.

Tags:    

Similar News