బాలీవుడ్ జనాల రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నా: ఎన్టీఆర్

Update: 2021-12-09 13:41 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. దేశమంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రిలీజ్ చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లబోతున్నారంటూ జక్కన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'ఆర్.ఆర్.ఆర్' ట్రైలర్ బీభత్సం సృష్టిస్తే.. 2022 జనవరి 7న ప్రభంజనమే అని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే 'RRR' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ముంబైలో స్పెషల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి లో రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - అలియా భట్ - అజయ్ దేవగన్ - నిర్మాత డీవీవీ దానయ్యతో పాటుగా పలువురు టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.

ముంబైలో జరిగిన మీడియా ఇంటరాక్షన్ తారక్ మాట్లాడుతూ.. RRR లో తన పాత్రకు బాలీవుడ్ నుంచి వచ్చే స్పందన కోసం చూస్తున్నానని అన్నారు. సినిమాలో తన భాష - నటన గురించి హిందీ విమర్శకులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో తెలుసుకోడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

దేశంలోని ఇంత పెద్ద స్టార్స్ తో నటించడం ఒక కల అని.. 'ఆర్.ఆర్.ఆర్' మూవీతో కోల్పోయిన భారతీయ సినిమా వైభవం తిరిగొస్తుందని ఆశిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్‌ కు మరో హీరో రామ్ చరణ్ హాజరు కాలేకపోయారు. తన కుటుంబంలో పెళ్లి వేడుక ఉండటంతో చెర్రీ ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు.

చరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పలా కామినేని పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్లనే మెగా హీరో ఈ ఈవెంట్ కు అటెండ్ కాలేదు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జరగనున్న ఇతర ప్రచార కార్యక్రమాల్లో చరణ్ తప్పకుండా పాల్గొననున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News