ట్రైలర్ టాక్: సామాన్యుడి యుద్ధం
గత కొంత కాలంగా ఏవో ఆర్థిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన మంచు విష్ణు కొత్త సినిమా ఓటర్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది వర్తమాన రాజకీయాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాని ఎన్నికల సమయంలోనే ప్లాన్ చేశారు కాని అనుకోని అవాంతరాల వల్ల ఇప్పటికి తెరమీదకు వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. కథ విషయానికి వస్తే ఓ రాష్ట్రాన్ని దోచుకు తినడమే లక్ష్యంగా ఉంతటారు ఇద్దరు నాయకులు(సంపత్ రాజ్ - పోసాని).
వీళ్ళ వల్ల ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం జరగకపోగా అన్యాయంగా దగా పడుతున్నారని గుర్తించిన ఓ యువకుడు(మంచు విష్ణు)ప్రక్షాళనకు నడుం బిగిస్తాడు. అతనికి అండగా గురువు(నాజర్) ప్రియురాలు(సురభి)మిషన్ కు సహాయపడతారు. ఈ క్రమంలో అతనితో పాటు స్నేహితులు కూడా ప్రమాదంలో పడతారు. అప్పుడు సోషల్ మీడియా సహాయంతో పాటు వివిధ మార్గాల్లో ఆ ఇద్దరి ఆట కట్టించేందుకు సిద్ధ పడతాడు. అదెలా చేశాడు అన్నదే ఓటర్
థీమ్ బాగానే ఉంది కాని ఎన్నికల వేడి చల్లారిపోయన తరుణంలో ఇది మెప్పించాలంటే సాలిడ్ కంటెంట్ అవసరం. ట్రైలర్ ని బట్టి చూస్తే బలమైన స్టార్ క్యాస్ట్ తో పాటు పొలిటికల్ సెటైర్స్ బాగానే పడ్డట్టు ఉన్నాయి. సుప్రీత్-జయప్రకాశ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అడ్డాతో ప్రూవ్ చేసుకున్న జిఎస్ కార్తీక్ దీంట్లో సమాజాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ దుర్మార్గాన్ని కాన్సెప్ట్ గా తీసుకున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యింది. ప్రొడక్షన్ పరంగానూ బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకి ఈ ఓటర్ కోరుకున్న బ్రేక్ ఇస్తాడో లేదో జూన్ 21న తేలిపోతుంది
Full View