కేజీఎఫ్ తర్వాత యష్.. ఈసారైనా..

కేజీఎఫ్ సిరీస్‌ తో స్టార్ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తర్వాత ఆయన పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగింది.

Update: 2026-09-20 18:30 GMT

కేజీఎఫ్ సిరీస్‌ తో స్టార్ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తర్వాత ఆయన పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగింది. అలాంటి సమయంలో తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ యష్ మాత్రం తొందరపడలేదు. ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకుని టాక్సిక్ తో వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో ఇప్పుడు యష్ తీసుకున్న నాలుగేళ్ల బ్రేక్ మరోసారి చర్చగా మారింది.

కేజీఎఫ్ 2 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా తర్వాత యష్ నుంచి వెంటనే మరో సినిమా వస్తుందని చాలామంది భావించారు. కానీ కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఆయన చాలా సమయం తీసుకున్నారు. స్టోరీ, స్కేల్, దర్శకుడు వంటి అంశాలపై ఆచితూచి ముందుకు వెళ్లారు. చివరకు టాక్సిక్ ను ప్రకటించారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ అయింది

యష్‌ తో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ వంటి స్టార్ క్యాస్టింగ్ కలిశారు. భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు కూడా అదే రేంజ్ లో ఏర్పడ్డాయి. నాలుగేళ్ల తర్వాత యష్ ను స్క్రీన్ పై చూడబోతుండటంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కనిపించింది. కానీ విడుదల తర్వాత సీన్ రివర్స్ అయింది. టాక్సిక్ కు తొలి రోజే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే టాక్ గట్టిగా వినిపించింది. యష్ క్రేజ్ కారణంగా వసూళ్లు ఒక స్థాయికి చేరుకున్నా.. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిరాశపరిచింది. ఇక్కడే యష్ తీసుకున్న గ్యాప్ గురించి చర్చ మొదలైంది. ఎక్కువ కాలం సినిమాకు దూరంగా ఉన్న హీరో తిరిగి వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు అంచనాలు కూడా భారీగా ఉంటాయి.

కేజీఎఫ్ వంటి సక్సెస్ ఫుల్ సిరీస్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరగడం సహజమే. అందుకే టాక్సిక్ రిజల్ట్ యష్ కెరీర్‌ లో ప్రత్యేకంగా డిస్కస్ చేసుకునే ఎలిమెంట్ గా మారింది. అయితే నాలుగేళ్ల కాలంలో యష్ కెరీర్‌ లో మరో మెయిన్ ఛేంజ్ జరిగింది. కేజీఎఫ్ కు ముందు ఆయనకు కన్నడ మార్కెట్‌ లోనే మంచి గుర్తింపు ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు ఆయన సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

దీంతో యష్ సెలెక్ట్ చేసుకునే ప్రతి మూవీ కూడా డిబేట్ గా మారుతుంది. టాక్సిక్ రిజల్ట్ తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ పై కూడా ఇదే ఇంట్రెస్ట్ కొనసాగుతోంది. ఈసారి స్టోరీ సెలక్షన్ లో యష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మెయిన్ గా మారింది. కేజీఎఫ్ తర్వాత వచ్చిన గుర్తింపు యష్‌ కు పాన్ ఇండియా మార్కెట్‌ ను తెచ్చిపెట్టింది. నాలుగేళ్ల బ్రేక్ తర్వాత వచ్చిన టాక్సిక్ మాత్రం ఆ జర్నీలో ఆశించిన టర్నింగ్ పాయింట్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు యష్ ముందున్న నెక్స్ట్ మూవీ.. ఆయన కెరీర్‌ లో మరో కొత్త ఛాప్టర్ ను మొదలుపెడుతుందా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News