ఈసారి నేషనల్ అవార్డ్ పక్కానా?

సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులకు కోపం రావాలి.. ఆ రోల్ చేసిన నటిని చూస్తే మాత్రం చప్పట్లు కొట్టాలనిపించాలి.

Update: 2026-09-21 00:30 GMT

సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులకు కోపం రావాలి.. ఆ రోల్ చేసిన నటిని చూస్తే మాత్రం చప్పట్లు కొట్టాలనిపించాలి. ప్రస్తుతం మాలీవుడ్ నటి ఊర్వశి విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఆశ సినిమాలో ఆమె పోషించిన రోల్ పై ప్రేక్షకుల్లో ఫుల్ కోపం వస్తుండగా.. అదే సమయంలో ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈసారి ఊర్వశికి నేషనల్ అవార్డ్ వస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.

సెప్టెంబర్ 11న విడుదలైన ఆశలో ఊర్వశి పోషించిన రోల్ చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణ తల్లి పాత్రకు భిన్నంగా కోపం, భయం, బాధ, అసహనం వంటి ఎన్నో ఫీలింగ్స్ ను ఒకేసారి పలికించాల్సిన క్యారెక్టర్ ఇది. ఆ రోల్ లో ఊర్వశి యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్, కళ్లతోనే ఫీలింగ్స్ ను పలికించే విధానం స్పెషల్ గా నిలిచిందనే ప్రశంసలు వస్తున్నాయి.

సినిమా చూసిన తర్వాత రోల్ ను ప్రేక్షకులు అసహ్యించుకోవడం.. కానీ అదే పాత్రలో నటించిన ఊర్వశిని మాత్రం మెచ్చుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక నటికి ఇంతకంటే మంచి ప్రశంస ఇంకేం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు ఆమె యక్టింగ్ ను ఎప్పటి మర్చిపోలేమని చెబుతున్నారు. మరికొందరు అయితే నేషనల్ అవార్డు రావడం గురించి మాట్లాడుతున్నారు.

ఇక్కడే ఊర్వశి ఇప్పటికే అందుకున్న నేషనల్ అవార్డు గుర్తుకొస్తోంది. ఉల్లోరుక్కు సినిమాలో యాక్టింగ్ కు ఆమె బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ క్యాటగిరీలో జాతీయ పురస్కారం అందుకున్నారు. అయితే ఆశలో ఆమెది సపోర్టింగ్ రోల్ కాదు. కథలో కీలకమైన మెయిన్ రోల్ ను ఆమె పోషించారు. సినిమా ఎమోషన్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఎక్కువగా ఆమె రోల్ పైనే ఉంటుంది.

నిజానికి 40 ఏళ్లకుపైగా సినీ జర్నీ చేసిన ఊర్వశికి యాక్టింగ్ లో వైవిధ్యం కొత్త కాదు. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు చేశారు. హీరోయిన్‌ గా ఉన్న సమయంలోనే కామెడీ రోల్స్ లో తన బెస్ట్ టైమింగ్ చూపించారు. అదే సమయంలో ఎమోషనల్ సీన్స్‌ లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు ఆశతో మరోసారి తనలోని మరో నటిని ప్రేక్షకులకు పరిచయం చేసినట్టైంది.

ముఖ్యంగా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమె చూపించిన ఇంటెన్సిటీ ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది. మాటలు లేకుండానే భయం, కోపం, బాధను వ్యక్తపరిచే సీన్స్ ఆమె యాక్టింగ్ గా స్ట్రెంత్ గా నిలిచాయి. అయితే సోషల్ మీడియా ప్రశంసలు, ప్రేక్షకుల అభిప్రాయాలు జాతీయ అవార్డుకు హామీ కావు. అవార్డు నిర్ణయం అఫీషియల్ జ్యూరీ అబ్జర్వేషన్ తర్వాతే తెలుస్తుంది. కానీ ఆశలో ఊర్వశి యాక్టింగ్ పై ఇప్పుడే నేషనల్ అవార్డు రేంజ్ లో చర్చ మొదలవడం మాత్రం ఆమె పెర్ఫార్మెన్స్ ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికి ఎగ్జాంపుల్.

Tags:    

Similar News