ఫోటో స్టోరి: మీర్జాపూర్ ముంతాజ్ బీబీ కిక్కో కిక్కు!

తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2026-09-21 02:45 GMT

తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి బాలకృష్ణ సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయినా.. డిజిటల్ మాధ్యమాలు- ఓటీటీ సిరీస్‌లతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.




 


తాజాగా సోనాల్ చౌహాన్ క్రేజీ ప్రాజెక్ట్ `మీర్జాపూర్ ది మూవీ`లో `ముంతాజ్ బీబీ` అనే సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్-చిత్రంలో త‌న‌ నటనకు, గ్లామర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేసిన ఆన్-లొకేషన్ ఇంటెన్స్ ఫోటోగ్రాఫ్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముంతాజ్ పాత్రలో సోనాల్ గ్లామరస్ లుక్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.




 


ముఖ్యంగా ఈ ఫొటోల్లో సోనాల్ బ్యాక్‌లెస్ లుక్ నెట్టింట పెను సంచలనం సృష్టిస్తోంది. అలాగే నటుడు రవికిషన్‌తో కనిపించిన ఇంటెన్స్ లుక్ కూడా చిత్రాలపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. తనను ముంతాజ్‌గా ఎంచుకున్నందుకు... ఇంతటి ఆదరణ ఇస్తున్న ప్రేక్షకులకు సోనాల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాత్ర తనకు సరికొత్త అనుభూతినిచ్చిందని.. ఇటువంటి విభిన్నమైన పాత్రను ఎంచుకోవడం సాహసంతో కూడుకున్నదని ఈ అందాల భామ‌ పేర్కొన్నారు.




 


ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్ దర్శకుడు గుర్మీత్ సింగ్, పునీత్ జీ, కాస్టింగ్ డైరెక్టర్లు, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి చారిత్రాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. అభిమానులు తనకు ఇస్తున్న అండదండల వల్ల‌నే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. సోనాల్ తాజా పోస్ట్ కింద నెటిజన్లు, అభిమానుల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.




 


ఇక మీర్జాపూర్ విజయంతో జోరుమీదున్న సోనాల్ చౌహాన్ తదుపరి `షెరా` అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తన గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్‌తో డిజిటల్ తెర‌పైనా - వెండితెరపైనా తన ప్రభావాన్ని మరింత చాటుకుంటూ ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News