కళా తపస్వికి కూడా డబ్బు పిచ్చా?

Update: 2015-11-19 11:32 GMT
టాలీవుడ్ లో డైరెక్టర్ గా కళా తపస్వి కె.విశ్వనాథ్ కి చాలా మంచి పేరుంది. మంచి నటుడిగానే కాదు, గొప్ప వ్యక్తిగాను ఆయన్ని కీర్తిస్తారు చాలామంది. ఎన్నో మూవీస్ లో తన నటనతో ప్రాణం పోసిన ఆయన చుట్టూ ఇప్పుడో వివాదం చుట్టుముడుతోంది. కె. విశ్వనాథ్ ని డబ్బు మనిషి అనేందుకు కారణమవుతోంది.

ఇంత వయసులో కూడా యాక్టింగ్ కొనసాగించడమంటే.. సినిమాలపై ప్రేమతో పాటు డబ్బు కూడా ఖచ్చితంగా కారణమే అనడంలో సందేహం అక్కరలేదు. దీనికి ఎవరూ అబ్జెక్షన్ చెప్పబోరు కూడా. రీసెంట్ గా తన అ.. ఆ.. మూవీలో ఓ కేరక్టర్ కోసం విశ్వనాథ్ ని అడిగాడట త్రివిక్రమ్. ఇప్పటి ట్రెండ్ ప్రకారం రోజుకో లక్ష చొప్పున ఇవ్వాలని కోరారట విశ్వనాథ్. దీనికి ముందు కొంత ఆశ్చర్యపోయినా... సరే అని ఒప్పుకుని తన మనిషిని అగ్రిమెంట్ కోసం పంపాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలా ఒప్పందంపై సంతకం కోసం వ్యక్తితో.. నేను 2 లక్షలు అడిగాను కదా రోజుకు అన్నారట కె. విశ్వనాథ్. ఈవిషయం త్రివిక్రం వరకూ వెళ్లినా.. కొన్ని లక్షలకోసం అంత పెద్దాయనతో వాదన ఎందుకు అని అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది.

అయితే.. అన్ని సినిమాల అనుభవం, గొప్ప వ్యక్తిగా పేరు ఉన్న కె. విశ్వనాథ్ నిజంగా అలాంటి పని చేసుంటారా అన్నదే ఇప్పుడు అసలు అనుమానం. ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందించకపోయినా.. టాలీవుడ్ లో మాత్రం ఇది నిజమే అని వినిపిస్తోంది. డబ్బుకు లోకం దాసోహం అని సామెతలు కూడా చెప్పేసుకుంటున్నారు. ఈ వివాదం గురించి త్రివిక్రం నోరు విప్పితే తప్ప అసలు నిజం ఏంటో తెలిసే అవకాశం లేదన్నది మాత్రం స్పష్టమే.
Tags:    

Similar News