మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హీరోగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన విశ్వక్.. ఇప్పుడు ''ముఖచిత్రం'' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు.
మంగళవారం విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా 'ముఖచిత్రం' మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో విశ్వక్ క్యారెక్టర్ కి సంబంధించి ఓ గ్లింప్స్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు.
ఇందులో లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తుండగా.. ఈ వీడియో అతని పాత్ర తీరుతెన్నులను వివరిస్తుంది. సీనియర్ మోస్ట్ లాయర్లను సైతం తన వాదనలతో ఏడిపించే యంగ్ అడ్వకేట్ క్యారెక్టర్ లో విశ్వక్ ఆకట్టుకున్నారు.
ఇక చివర్లో “మీ అంచనాలు అందుకోడానికి.. నేను చాలా వంగాల్సి వచ్చింది..” అంటూ విశ్వక్ తనదైన శైలిలో డైలాగ్ వదిలారు. యువ హీరో తన కెరీర్ లో తొలిసారిగా నల్లకోటు ధరించారు. ఇందులో అతని పాత్ర 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం.
విభిన్నమైన కథ కథనాలతో కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ''ముఖచిత్రం'' సినిమాతో గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'కలర్ ఫొటో' ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. ఇందులో వికాస్ వశిష్ట - ప్రియా వడ్లమాని - '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావ్ - అయేషా ఖాన్ - సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు.
SKN సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్ - మోహన్ ఎల్లా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ అందించారు. త్వరలోనే 'ముఖచిత్రం' చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Full View