• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గీతాంజలి దర్శకుడి సాహసం

గీతాంజలి దర్శకుడి సాహసం

By - Tupaki Desk
Update: 2018-07-17 13:30 GMT
కామెడీ హారర్ జానర్ లో ఒక ట్రెండ్ సృష్టించిన గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ కొత్త సినిమా విశ్వామిత్ర లోగో లాంచ్ అయ్యింది. సత్యం రాజేష్ హీరోగా నందిత రాజ్ హీరోయిన్ గా అశుతోష్ రానా మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. కథ బాగుందని చెప్పిన కొందరు హీరోయిన్లు సత్యం రాజేష్ హీరో అనగానే  వద్దని చెప్పారని కానీ నందితా రాజ్ మాత్రం చేయడానికి ముందుకువచ్చారని చెప్పిన రాజ్ కిరణ్ ఆమెకు ప్రత్యేక థాంక్స్ చెప్పాడు. అమెరికాలో జరిగిన నమ్మశక్యం కానీ ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా కథ రాసుకున్నానని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని హామీ ఇచ్చారు. వంశీ కృష్ణ ఆకెళ్ళ మాటలు మరో ప్లస్ పాయింట్ గా చెప్పిన రాజ్ కిరణ్ లోగో ద్వారా ఆసక్తి రేపాడు.

గీతాంజలి సక్సెస్ తర్వాత కలర్స్ స్వాతితో రాజ్ కిరణ్  తీసిన త్రిపుర ఆశించిన విజయం అందుకోలేదు. ఆ తర్వాత మంచు విష్ణుతో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో తీసిన లక్కున్నోడు సక్సెస్ కాలేదు. అందుకే తనకు పట్టున్న హారర్ థ్రిల్లర్ వైపు రాజ్ కిరణ్ మళ్ళి టర్న్ తీసుకున్నాడు. సత్యం రాజేష్ సైతం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ పేరుకి హీరో అయినా మిగిలిన పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విశ్వామిత్ర టైటిల్ తో పాటు లోగో పోస్టర్ ద్వారా హైప్ తెచ్చే ప్రయత్నం చేసిన టీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పొచ్చు. విడుదల ఇంకా ఖరారు కానీ విశ్వామిత్రకు జవాన్ ఫేమ్ దర్శకుడు బివిఎస్ రవి సహకారం కూడా ఉందని రాజ్ కిరణ్ స్పష్టం చేసారు. రాజ్ కిరణ్ దర్శకుడైనప్పటికీ వంశీ కృష్ణ ఆకెళ్ళ-బివిఎస్ రవి ఇలా ముగ్గురు దర్శకుల టీమ్ తో వస్తున్న విశ్వామిత్ర మీద అంచనాలు మెల్లగా పెరిగేలా ఉన్నాయి.
Tags:    
  • Raj Kiran 
  • Vishwamitra Movie 
  • Telugu NEws 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS