విశాల్ ను వదలని వ్యతిరేక సెగలు
ఎన్ని చేసినా ఎంత అభివృద్ధి చేసి చూపించినా విశాల్ కు కోలీవుడ్ లో అసమ్మతి సెగలు తప్పడం లేదు. కొద్దిరోజుల క్రితం విశాల్ అంటే గిట్టని కొందరు దర్శకులు నటులు సమాఖ్య కార్యాలయానికి తాళం వేయడం పెద్ద దుమారమే రేపింది. అది పూర్తిగా చల్లారలేదు కానీ కొంత మేర సద్దుమణిగింది. అయితే నిన్న మొన్న ఇళయరాజా 75వ పుట్టినరోజును పురస్కరించుకుని నడిగర్ సంఘం నిధుల కోసం విశాల్ చేపట్టిన రెండు రోజుల మెగా లైవ్ కన్సర్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయినా కూడా విశాల్ కు మనస్తాపం కలిగించే సంఘటనలు జరిగాయి.
అందులో వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ విశాల్ కు అత్యంత చేదోడువాదోడుగా ఉన్న పార్తిబన్ రాజీనామా చేసి ఈ ఈవెంట్ జరిగిన రెండు రోజులు దూరంగా ఉన్నాడు. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పకపోయినా ట్వీట్ల ద్వారా తన బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. అయితే బుజ్జగించే టైం లేకపోవడంతో విశాల్ వేడుక పూర్తయ్యాక పార్తిబన్ ను పొగుడుతూ ట్వీట్ చేసాడు. అసలు దీనికి కారణం ఎంటని ఆరా తీస్తే పార్తిబన్ చెప్పిన కొన్ని అంశాలు ప్రోగ్రాంలో చేర్చలేదట. తన మాట లెక్క చేయనప్పుడు ఎందుకు కొనసాగాలి అని వైదొలగినట్టు చెబుతున్నారు.
నిజానికి ఈ ప్రోగ్రాంకు ఏఆర్ రెహ్మాన్ ను రప్పించడంలో పార్తిబన్ కృషి చాలా ఉంది. అయితే ఇది పరిగణలోకి తీసుకోకుండా తనను పక్కన పెట్టడం పట్ల పార్తిబన్ హర్ట్ అయ్యడట. విశాల్ ప్రస్తుతం నటిస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్యలో విలన్ గా పార్తిబన్ నటిస్తున్నాడు. తెలుగులో ఒకప్పుడు హీరొయిన్ గా వెలిగి ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ అరిస్ట్ గా కనిపిస్తున్న సీత భర్తన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఇళయరాజా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినా పార్తిబన్ రాజీనామాతో విశాల్ కు చివరికి కొంత మనస్థాపం మిగిలింది