'విరాటపర్వం' మోస్ట్‌ ఇంట్రెస్టంగ్‌ అప్‌డేట్‌

Update: 2021-09-09 10:35 GMT
రానా.. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విరాటపర్వం సినిమా గురించి గత మూడు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. తీరా విడుదల ముంగిట ఉన్న సమయంలో కరోనా వచ్చింది. ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా విరాటపర్వం సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆమద్య సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. కాని ఆ విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. కొన్ని వారాల క్రితం చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ సినిమా వారం నుండి పది రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అది పూర్తి అయితే విడుదలకు సంబంధించిన విషయమై అధికారికంగా స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ఎట్టకేలకు సినిమా చివరి షెడ్యూల్‌ ప్రారంభం అయ్యిందని.. సినిమాను రెండు మూడు రోజుల్లోనే ముగించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విరాటపర్వం సినిమా ను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

మొదట ప్రముఖ ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని థియేటర్లు పునః ప్రారంభం అవ్వడంతో పాటు జనాలు కూడా థియేటర్లకు వస్తున్నారు. సాయి పల్లవి మరియు రానాలకు మంచి మార్కెట్ ఉండటం వల్ల ఖచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అందుకే సినిమా విడుదల విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు అంటూ టాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం విరాటపర్వంకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ ముగిసిన వెంటనే విడుదల తేదీ విషయంలో స్పష్టతను ఇస్తారని తెలుస్తోంది. సినిమాలను థియేటర్ల ద్వారా విడుదల చేసి.. ఫలితాన్ని బట్టి ఓటీటీ లో విడుదల చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కనుక రెండు విధాలుగా లాభం దక్కేలా బిజినెస్ జరుగుతుందని అందుకే ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు అంటూ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఈ సినిమాలోని సాయి పల్లవి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని పాటలు మరియు టీజర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. సాయి పల్లవిని అలా చూడటం కోసం అభిమానులు అంతా వెయిట్‌ చేస్తున్నాయి. ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టే సత్తా సాయి పల్లవికి ఉంది. అందుకే ఈ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేణు ఉడుగుల సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపించే దర్శకులు కూడా ఉన్నారు. కనుక ఈ సినిమా ఒక ప్రత్యేక సినిమాగా ఉంటుంది కనుక థియేటర్ల ద్వారా విడుదల చేయడం కన్ఫర్మ్‌ అంటున్నారు. ఈ సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. విరాటపర్వం ఓటీటీ కాకుండా థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అవుతుంది అనే వార్త ఖచ్చితంగా సినీ అభిమానులకు మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్‌ అనడంలో సందేహం లేదు.



Tags:    

Similar News