ఆయన దయ వల్ల ఇంటి పేరునే మార్చేసిన డైరెక్టర్!
కిషోర్ తిరుమల గురించి పరిచయం అవసరం లేదు. `నేను శైలజ` తో ఎంట్రీ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకుడిగా తనదైన ముద్ర వేసాడు.;
కిషోర్ తిరుమల గురించి పరిచయం అవసరం లేదు. `నేను శైలజ` తో ఎంట్రీ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకుడిగా తనదైన ముద్ర వేసాడు. క్లాసిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్రలహరి`,` రెడ్`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` లాంటి విజయాలు మంచి గుర్తింపునిచ్చాయి. ఇటీవలే రిలీజ్ అయిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా యావరేజ్ గా ఆడుతోంది. స్టోరీలు రెగ్యులర్ గా ఉన్నా? తనదైన ట్రీట్ మెంట్ తో ఆకట్టుకోవడం కిషోర్ ప్రత్యేకత.
అతడి ప్రతిభకు భవిష్యత్ లో పెద్ద డైరెక్టర్ గా ఎదగడానికి అవకాశాలున్నాయి. ఇలా ఇండస్ట్రీలో కిషోర్ ప్రస్థానం కొనసాగుతోంది. తాజాగా కిషోర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. సాధారణంగా దర్శకుల ఇంటిపేర్లు ఫేమస్ అయిన తర్వాత మారిపోతుంటుంటాయి. సినిమా టైటిల్సే ఇంటి పేరుగా మారిపోతుంటాయి. `బొమ్మరిల్లు` సినిమాతో భాస్కర్ కాస్త బొమ్మరిల్లుగా మారారు. రాజు పేరు ముందు దిల్ హిట్ చేరడంతో దిల్ రాజు అయ్యారు. నరేష్ కాస్త అల్లరి అయ్యారు. ఇంకా పాత విషయాల్లోకి వెళ్తే జానకి కాస్త `షావుకారు జానకి` గా మారారు. కళ్లు
`కళ్లు` చిదంబరం, `శుభలేఖ` సుధాకర్, `సాక్షి` రంగరారావు, `ఆహుతి` ప్రసాద్ ఇలా చాలా మంది నటుల ఇంటిపేర్లు సినిమా టైటిల్స్ తోనే సంచలనమయ్యారు. తాజాగా కిషోర్ తిరుమల ఇంటిపేరు నెట్టింట చర్చకొచ్చింది. తిరుమల అన్నది కిషోర్ ఇంటి పేరు కాదు. ఆయనది తిరుపతికి సమీపంలో ఉండే ఊరు. దీంతో ఇండస్ట్రీకి వచ్చే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రయాణం మొదలు పెట్టాడు. డైరెక్టర్ గా సక్సస్ అయితే ఇంటి పేరు మార్చు కుంటానని స్వామివారికి ప్రామిస్ చేసాడు. సక్సెస్ అవ్వడంతో? తన ఇంటి పేరుకు బధులుగా తిరుమలగా మార్చుకున్నారు.
దీంతో కిషోర్ శ్రీవారిని ఎంతగా విశ్వశిస్తారు? అన్నది చెప్పొచ్చు. సెలబ్రిటీలంతా శ్రీవారిని దర్శించుకోవడం అన్నది నిత్యం జరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నటులు ఎక్కువగా పాల్గొంటారు. తమ సినిమాలు రిలీజ్ కుముందు..రిలీజ్ అనంతరం సక్సెస్ అయినా? తప్పక దర్శనం చేసుకుంటారు. ఎంతో సెంటిమెంట్ గా సెలబ్రిటీలు భావిస్తుంటారు. కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీ వెంకటే శ్వరస్వామి. ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. స్వామి నామం పఠిస్తె చాలు సర్వశుభాలు సిద్దిస్తాయని అంతా నమ్ముతారు.