అత‌డు అంత తెలివి త‌క్కువ డైరెక్ట‌రా?

ప‌ర్హాన్ అక్త‌ర్ తెర‌కెక్కించాల్సిన `డాన్ 3` ఇబ్బందుల్లో ఉంది అన్న మాట వాస్త‌వం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్ప‌టికే సినిమా ప‌ట్టాలెక్కాలి.;

Update: 2026-01-18 16:30 GMT

ప‌ర్హాన్ అక్త‌ర్ తెర‌కెక్కించాల్సిన `డాన్ 3` ఇబ్బందుల్లో ఉంది అన్న మాట వాస్త‌వం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇప్ప‌టికే సినిమా ప‌ట్టాలెక్కాలి. కానీ ప్రాజెక్ట్ లో అనూహ్యా మార్పుల‌తో మొత్తం ఆర్డ‌రే మారిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చిన్న చిన్న న‌టుల ఎగ్జిట్ అవ్వ‌గా తాజాగా అందులో హీరోగా న‌టించాల్సిన ర‌ణ‌వీర్ సింగ్ త‌ప్పుకోవ‌డంతో సీన్ మొత్తం మారిపోతుంది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ర‌ణ‌వీర్ సింగ్ ఎగ్జిట్ అయిన నాటి నుంచి హీరో సెట్ అవ్వ‌డం అసాధ్యంగా మారింది. ఇప్ప‌టికే ప‌ర్హాన్ అక్త‌ర్ చాలా మంది హీరోల‌ను ప్ర‌త్యామ్నాయంగా చూసాడు.

అందులో హృతిక్ రోష‌న్ కూడా ఉన్నారు. కానీ ఇత‌డి ఎంపిక క‌ష్టంగానే క‌నిపిస్తోంది. అలాగే మ‌రోసారి షారుక్ ఖాన్ నేరుగా డాన్ అవ‌తారం ఎత్తే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. తొలి రెండు భాగాల్లో న‌టించింది కూడా షారుక్ ఖాన్ కావ‌డంతో. అత‌డికే మ‌రోసారి ప‌ర్హాన్ ఛాన్స్ ఇచ్చాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ర‌ణ‌వీర్ సింగ్ ఎగ్జిట్ అవ్వ‌డానికి ముందు షారుక్ ఖాన్ పేరు ఓ కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే తెర‌పైకి వ‌చ్చింది. అత‌డు తప్పుకున్న త‌ర్వాత షారుక్ ఖాన్ హీరో ప్ర‌పోజ‌ల్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా నెట్టింట మ‌రో ప్ర‌చారం జరుగుతోంది.

ఇందులో షారుక్ ఖాన్ హీరోగా న‌టించాలంటే డైరెక్ట‌ర్ త‌ప్పుకోవాల‌నే డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లొ స్తున్నాయి. హీరోగా న‌టించ‌డానికి షారుక్ ఖాన్ కి ఎలాంటి అభ్యంత‌రం లేదు గానీ అది జ‌ర‌గాలంటే ప‌ర్హాన్ అక్త‌ర్ త‌ప్పుకుని ఆ స్థానంలోకి అట్లీని తీసుకురావాలని షారుక్ అడుగుతున్నాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది.మ‌రి ఇది జ‌రిగే ప‌నేనా? అంటే అదే జ‌రిగితే అదేదో సామెత చెప్పిన‌ట్లే ఉంటుంది. ప‌ర్హాన్ అక్త‌ర్ `డాన్` ప్రాంచైజీ ని 1978 లో రిలీజ్ అయిన `డాన్` ని స్పూర్తిగా తీసుకుని మ‌లిచాడు. అందులో అమితాబ‌చ్చ‌న్ న‌టించ‌గా చంద్ర బ‌రోట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

`జావెద్ అలీ` అందించిన స్టోరీ అది. ఆ సినిమా స్పూర్తితోనే ప‌ర్హాన్ అక్త‌ర్ 2006 లో షారుక్ ఖాన్ హీరోగా `డాన్` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అప్ప‌ట్లో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. 38 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అనంత‌రం 2011లో అదే షారుక్ ఖాన్ తో ప‌ర్హాన్ అక్త‌ర్ `డాన్ 2` తెర‌కెక్కించి మ‌రో భారీ విజ‌యాన్ని అందించాడు. 70 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. తాజాగా తెర‌కెక్కించాల్సిన `డాన్ 3` క‌థ‌ను ప‌ర్హాన్ అండ్ కో ఎంతో స‌మ‌యం వెచ్చింది. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత ప‌ర్హాన్ అక్త‌ర్ కెప్టెన్ కుర్చీ ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్న చిత్ర‌మిది.

పిన్ టూ పిన్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. న‌చ్చిన న‌టీన‌టుల కోసం నెల‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేస్తున్నాడు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అంత ఎఫెర్ట్ పెట్టిన ప్రాజెక్ట్ ను అట్లీ చేతుల్లో పెట్టేసేంత తెలివి త‌క్కువ డైర‌క్ట‌రా? పాన్ ఇండియాలో హిందీ సినిమా ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన‌ `ధురంధ‌ర్`తొలి పాన్ ఇండియా విజ‌యం బాలీవుడ్ పేరిట న‌మోదైంది. అలాంటి స‌మ‌యంలో ఓ సౌత్ డైరెక్ట‌ర్ చేతుల్లో `డాన్ 3` ప్రాజెక్ట్ ని పెట్టే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.

Tags:    

Similar News