శర్వానంద్ టార్గెట్ అదే.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
శర్వానంద్.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.;
శర్వానంద్.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన.. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం వరుస కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇండస్ట్రీలోకి రాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ సహకారంతో ముంబైలోని కిషోర్ నమిత కపూర్ నట శిక్షణాలయంలో చేరి నాలుగు నెలల శిక్షణ తర్వాత హైదరాబాద్ కి చేరుకున్నారు. రెండేళ్ల కష్టం తర్వాత 19 ఏళ్లకే హీరోగా అవకాశం లభించింది అదే ఐదో తారీకు.
తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గౌరీ, శంకర్ దాదా ఎంబిబిఎస్, యువసేన, సంక్రాంతి, వెన్నెల, లక్ష్మీ, అమ్మ చెప్పింది వంటి5 సినిమాలలో నటించాడు. అయితే గమ్యం సినిమాతో భారీ సక్సెస్ లభించింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ వచ్చిన ఈయనకు ప్రస్థానం సినిమా మరో విజయాన్ని అందించింది. తర్వాత రన్ రాజా రన్ , ఎక్స్ప్రెస్ రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి, మహానుభావుడు, పడి పడి లేచే మనసు లాంటి చిత్రాలు శర్వానంద్ కు మంచి విజయాన్ని అందించాయి. అయితే చివరిగా మనమే సినిమాతో వచ్చిన ఈయన ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక బైకర్ అనే సినిమాతో పాటు భోగి అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇకపోతే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి టార్గెట్ గా తన సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది సంక్రాంతితో మంచి విజయం అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం తన లుక్ ను కూడా చాలా కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి మొదలు కాబోతుందట.. ఇప్పటికే ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ ను షూట్ చేశారట.. పైగా ఈ సినిమా కథను సహజంగా చూపించడానికి కొన్ని లొకేషన్లను కూడా వెతికి లాక్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమాల్లో ఆషిక రంగనాథ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈమె కూడా ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా నటించబోతున్నారట. ఏది ఏమైనా సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న శర్వానంద్ కు ఈ సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.