ఆమె తమిళ సినిమాకు ఓకే చెప్పడంతో బ్రేకప్‌..!

హిట్స్‌లో ఉన్న హీరోతో ప్రేమలో పడ్డ హీరోయిన్‌, ఆ తర్వాత హిట్స్ లేక పోవడంతో బ్రేకప్‌ చెప్పి వెళ్లి పోయిన సందర్భాలు ఉన్నాయంటారు.;

Update: 2026-03-16 06:29 GMT

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు చాలా కామన్‌. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. గతంతో పోల్చితే ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అయ్యాయి. వయసుతో సంబంధం లేదు అన్నట్లుగా ప్రేమలో పడుతున్న వారిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా హీరో హీరోయిన్‌గా నటిస్తున్న వారి మధ్య ఎక్కువగా ప్రేమ పుడుతూ ఉంది. గీతా గోవిందం సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ప్రేమ చిగురించింది, సుదీర్ఘ కాలం పాటు వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల వారు వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో ముందు ముందు చాలా మంది చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రేమ ఎంత కాలం కొనసాగుతుందో అనేది చెప్పలేని పరిస్థితి. హిట్‌, ఫ్లాప్స్‌ను బట్టి కూడా ప్రేమ ఆధారపడి ఉంటుందని గతంలో నిరూపితం అయింది.

టాలీవుడ్‌ ప్రేమ జంట బ్రేకప్‌...

హిట్స్‌లో ఉన్న హీరోతో ప్రేమలో పడ్డ హీరోయిన్‌, ఆ తర్వాత హిట్స్ లేక పోవడంతో బ్రేకప్‌ చెప్పి వెళ్లి పోయిన సందర్భాలు ఉన్నాయంటారు. అలాంటి బ్రేకప్‌ తాజాగా ఒకటి జరిగిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక యువ జంట ప్రేమలో పడటం, రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తర్వాత హిట్‌ లేక హీరో ఢీలా పడటం, హీరోయిన్‌కు పక్క భాష నుంచి ఆఫర్లు రావడంతో బ్రేకప్‌ కి దారి తీసింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఒక సినిమాలోనూ వీరు నటించారు. ఆ సినిమా ప్రమోషన్‌లో కలిసి పాల్గొంటున్నప్పటికీ, ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వారిని క్లోజ్‌గా పరిశీలించిన వారు అంటున్నారు. ఇద్దరూ ముందు ముందు మరిన్ని సినిమాలు కలిసి చేస్తారనే నమ్మకం లేదని ఇటీవల ప్రెస్‌ మీట్‌లో వారి తీరు చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు.

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు..

టీనేజ్‌లో ఉన్న ఆ ఇద్దరూ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దాంతో ఇద్దరికీ వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు వారిని ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. దాంతో కుర్రాడికి హీరోగా వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొత్తగా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. ఈ ఏడాది ఆయన నుంచి కొత్త సినిమాలు ఎన్ని వస్తాయి అనేది క్లారిటీ లేదు. మరో వైపు అమ్మాయి సైతం వరుసగా సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పక్క భాషల నుంచి వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె భావించింది. అందుకే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆఫర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తమిళ్‌ మూవీలో హీరోయిన్‌గా...

ఒక వైపు కుర్ర హీరోకు ఆఫర్లు తగ్గాయి, మరో వైపు హీరోయిన్‌గా ఆమె మెల్ల మెల్లగా బిజీ అవుతోంది. ఈ సమయంలోనే తమిళ్‌ మూవీలోనూ ఆఫర్‌ రావడంతో అతడికి దూరంగా ఉంటూ వచ్చిందట. హీరో, హీరోయిన్‌ మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బ తినడంకు తమిళ సినిమా ప్రధాన కారణం అంటూ కొందరు బాహాటంగానే అంటున్నారు. అయితే ఇద్దరూ చిన్న వయసులో మంచి స్నేహితులుగా ఉన్నారు, ఇప్పుడు ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అంతా మాత్రాన ఏదో ఒకటి ఊహించుకోవడం సరి కాదు అంటూ వారికి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా త్వరలో విడుదల కానుంది. ఆ సినిమా హిట్ అయితే వీరి బంధం కొనసాగి, మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం.

Tags:    

Similar News