100 కోట్లు.. బాలయ్య, నాగ్ నెక్స్ట్ ప్లాన్స్ తో సాధ్యమేనా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-18 23:30 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వారి కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రాగా.. ఇప్పుడు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ తోపాటు అభిమానుల్లో సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 2026 దసరాకు ఆ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా చేస్తున్నారు. చివరగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కూలీ మూవీతో థియేటర్స్ లో సందడి చేసిన ఆయన.. ఇప్పుడు రా కార్తీక్ దర్శకత్వంలో కింగ్ 100 చేస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉండనుందని తెలుస్తోంది. నాగ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు బాలయ్య, నాగ్ షూటింగ్స్ లో పాల్గొంటుండగా.. సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. వారిద్దరూ రూ.100 కోట్ల షేర్ మార్క్ ఎప్పుడు అందుకుంటారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కెరీర్ లో కొన్ని వందల సినిమాలు చేసిన వారు.. రూ.100 కోట్ల షేర్ ను ఏ మూవీతో కూడా సాధించలేదు. కానీ టాలీవుడ్ కు చెందిన అనేక మంది హీరోలు ఆ ఘనత అందుకున్నారు.

సీనియర్ హీరోల్లో చిరంజీవి, వెంకటేష్ తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సహా పలువురు రూ.100 కోట్ల షేర్ ను ఆయా చిత్రాలతో ఇప్పటికే సాధించారు. అందుకే ఇప్పుడు బాలకృష్ణ, నాగార్జున వంతు మాత్రమే మిగిలింది. దీంతో తమ అప్ కమింగ్ మూవీస్ తో వారిద్దరూ ఆ మార్క్ ను అందుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

నిజానికి బాలయ్య.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో రూ.100 కోట్ల షేర్ దగ్గరకు వెళ్లి ఆగిపోయారు. నాగార్జున కూడా సేమ్ అంతే. ఆయన నటించిన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాలు రూ.70 కోట్ల షేర్ వరకు రాబట్టాయి. అందుకే ఇప్పుడు అప్ కమింగ్ మూవీలతో రూ.100 కోట్ల షేర్ మార్క్ ను నాగ్, బాలయ్య అందుకుంటారో లేదో అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News