2021 హైక్లాస్ పార్టీ.. కాస్ట్ లీ ల‌వ్ క‌పుల్ చిలౌటే వేర‌యా..

Update: 2021-01-02 07:45 GMT
2020కి సెండాఫ్ చెప్పి 2021కి వెల్ కం చెప్పేందుకు సెల‌బ్రిటీలు ఎవ‌రికి వారు పోటీప‌డ్డారు. కొంద‌రు మాల్దీవుల‌కు వెళితే.. మ‌రికొంద‌రు గోవాలో చిలౌట్ చేశారు. అక్క‌డి నుంచి లైవ్ ఫోటోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. ఈసారి ఖ‌రీదైన పార్టీ అంటే నాగ‌చైత‌న్య‌- స‌మంత పార్టీ.. విఘ్నేష్ - న‌య‌న్ పార్టీ అనుకునేరు..! అదేమీ కాదు..

ఈసారికి విరాట్ కోహ్లీ -అనుష్క శర్మ  .. హార్దిక్ పాండ్యా - నటాషా స్టాంకోవిక్ నూతన సంవత్సర వేడుకలే హైలైట్ అని చెప్పాలి. భార్య అనుష్క శర్మతో కలిసి తొలి టెస్ట్ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ నూతన సంవత్సరంలో సన్నిహితులతో సెల‌బ్రేష‌న్ ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఈ దంపతులతో పాటు క్రికెటర్ హార్దిక్ పాండ్యా- అతని భార్య నటాషా స్టాంకోవిక్ పార్టీలో జాయిన‌య్యారు.  

వారి నూతన సంవత్సర వేడుకల విందు నుండి ఫోటోల‌ను కోహ్లీ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేశారు. ఈ చిత్రాలలో ఒకదానిలో జంటలు డిన్నర్ టేబుల్ చుట్టూ కూర్చుని పోజులిచ్చారు. విరాట్ - అనుష్క తమ సోషల్ మీడియాల్లోనూ ఈ అద్భుతమైన చిత్రాలను పంచుకున్నారు. వారి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

విరాట్ తన పోస్ట్ ‌కు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``ప్రతికూలతలోనూ.. స్నేహితులు కలిసి సానుకూల సమయాన్ని గడుపుతారు! సురక్షితమైన వాతావరణంలో స్నేహితులతో కలవడం కంటే ఆనందం మరొక‌టి లేదు. ఈ సంవత్సరం చాలా ఆనందం మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది. సురక్షితంగా ఉండండి`` అని వ్యాఖ్య‌ను జోడించారు. అనుష్క శ‌ర్మ ఇదే సందేశాన్ని అభిమానుల‌కు అందించారు.

ఇటీవల హార్దిక్-న‌టాషా జంట పేరెంట్ అయిన సంగ‌తి తెలిసిన‌దే.  న‌టాషా జూనియ‌ర్ హార్థిక్ కి వెల్ కం చెప్పారు. ఒక పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన నటాషా... త్వ‌ర‌లోనే అనుష్క శ‌ర్మ- విరాట్ జంట‌ కూడా త‌మ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. ముంబైలోని ఖ‌రీదైన విలాస‌వంత‌మైన స్టార్ హోట‌ల్లో ఈ పార్టీ రంజుగా సాగింద‌ని బ్యాక్ గ్రౌండ్ విజువ‌ల్స్ చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాయి.
Tags:    

Similar News