వినాయక్ కు ఒక హీరో కావాలి
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలతో.. సీనియర్ స్టార్ హీరోలతో పలు చిత్రాలు తెరకెక్కించి సూపర్ హిట్స్ ను దక్కించుకున్న దర్శకుడు వివి వినాయక్. ప్రభాస్.. ఎన్టీఆర్.. చిరంజీవి.. బాలకృష్ణ.. రవితేజ వంటి స్టార్స్ తో సూపర్ హిట్స్ ఇచ్చిన వినాయక్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆమద్య వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చడంతో ఈయన దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు వెనుక ముందు ఆడుతున్నారు.
పైగా ఆమద్య శీనయ్య సినిమాతో వినాయక్ నటుడిగా పరిచయం అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ సినిమా ఏవో కారణాల వల్ల అటకెక్కింది. దాంతో మళ్లీ దర్శకత్వం వైపు మల్లాడు. గత రెండు నెలలుగా విపత్తు కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన వినాయక్ ఆ సమయంలో కొన్ని స్కిప్ట్ లను స్టోరీ లైన్స్ ను సిద్దం చేశాడట. ఈ సమయంలో వెంటనే వినాయక్ కు ఒక హీరో కావాలట. కాని హీరోలు అంతా కూడా ఇతర దర్శకులకు కమిట్ మెంట్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు.
వినాయక్ కు ఇప్పటికి ఇప్పుడు డేట్లు ఇచ్చి సినిమా చేసేందుకు ఏ హీరో కూడా రెడీగా లేడు. వచ్చే ఏడాదిలో అయినా వినాయక్ కు డేట్లు ఇచ్చేందుకు ఏ హీరో అయినా ఇంట్రెస్ట్ చూపిస్తాడా అంటే సరైన సమాధానం వచ్చే పరిస్థితి లేదు. కొత్త వారితో లేదా చిన్న హీరోలతో వినాయక్ సినిమా చేసి తన సత్తాను నిరూపించుకుని మళ్లీ స్టార్ హీరోల డేట్ల కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. వినాయక్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.