కొ..ణి..దె..ల రామ్ కుటుంబం

Update: 2019-01-01 06:03 GMT
బోయపాటి సినిమాల్లో వయోలెన్స్ హైలైట్ అయినంతగా ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ కావు గానీ  'భద్ర'.. నుండి  'జయ జానకి నాయక' వరకూ బోయపాటి దర్శకత్వం వహించిన అన్నీ సినిమాలలో ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీటే వేశాడు.  ఇక సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న బోయపాటి తాజా చిత్రం 'వినయ విధేయ రామ' లో కూడా చరణ్ ను భారీ యాక్షన్ హీరో గా విధ్వంస రాముడిగా ప్రొజెక్ట్ చేసినా అదే సమయంలో తన కుటుంబానికి వినయ విధేయ రాముడిగా చూపిస్తున్నాడు.
 
2018 కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరం 2019 కు స్వాగతం చెబుతున్న సందర్భంగా 'వినయ విధేయ రామ' టీమ్ తాజాగా ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది.  ఈ పోస్టర్లో చరణ్ తో పాటు తన కుటుంబ సభ్యులంతా సంప్రదాయ దుస్తులలో కళకళలాడుతున్నాడు.  ప్రశాంత్.. రవి వర్మ.. ఆర్యన్ రాజేష్.. మధు నందన్.. స్నేహ.. అనన్య.. హిమజ తదితరులు ఉన్నారు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో పండగ ను జరుపుకుంటూ కుటుంబ సభ్యులతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవాలి.  మరి ఇలాంటి అందమైన.. ముచ్చటైన  కొ .. ణి.. దె.. ల కుటుంబం జోలికి పందెం పరశురామ్ వచ్చినందుకే రామ్ ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తి శత్రువుల అంతు తెలుస్తాడేమో. 
Read more!

ఈ సినిమాప్రోమోస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మాత్రమే చూపించకుండా కుటుంబాన్ని హైలైట్ చేస్తున్నారంటే బోయపాటి ఈ సినిమాలో స్ట్రాంగ్ ఫ్యామిలీ డ్రామాను కూడా చూపిస్తున్నట్టే లెక్క.  ఈ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Full View
Tags:    

Similar News