• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విక్రమ్‌' పుకార్లు నిజమే...

'విక్రమ్‌' పుకార్లు నిజమే అయితే మరో విశ్వరూపమే

By - Tupaki Desk
Update: 2021-07-20 09:38 GMT
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు. మరగుజ్జు వాడి పాత్ర నుండి పండు ముసలి వాడి పాత్ర వరకు ఎన్నో పాత్రలు చేసిన కమల్‌ హాసన్‌ ప్రస్తుతం తాను నటిస్తున్న 'విక్రమ్‌' సినిమాలో మరో విభిన్నమైన రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విక్రమ్‌ సినిమా కమల్ హాసన్‌ గుడ్డి వాడి పాత్రలో కనిపించబోతున్నాడట.

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఈ సినిమాలో కమల్‌ నట విశ్వరూపంను చూపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో కమల్‌ హాసన్‌ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన నటన ఆస్కార్‌ అవార్డు లెవల్ లో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కమల్‌ నటనకు మంచి కంటెంట్‌ యాడ్‌ అయితే అదో అద్బతంగా నిలుస్తుందని ఇప్పటికే వచ్చిన పలు సినిమాలతో నిరూపితం అయ్యింది. అందుకే ఈ సినిమా లో కమల్‌ అంధుడిగా నటించడం వల్ల ఖచ్చితంగా ఆయన నట విశ్వరూపం మళ్లీ అభిమానులు చూసే అవకాశం ఉంటుందని అభిమానులు మరియు మీడియా వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. విక్రమ్‌ సినిమాను పాన్ ఇండియా కంటెంట్‌ గా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో తమిళ స్టార్‌ విజయ్ సేతుపతి మరియు మలయాళ లేటెస్ట్‌ సూపర్ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్ లు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. వీరిద్దరు కూడా విలన్‌ గా నటిస్తే సినిమా రేంజ్‌ మరో లెవల్‌ లో ఉంటుందని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. ఇద్దరు సూపర్‌ విలన్‌ లు ఉండబోతున్న ఈ సినిమాలో హీరో గుడ్డి వాడు అంటే వినడానికే కాస్త విభిన్నంగా విచిత్రంగా ఉంది. కనుక ఇది ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందని ఈ కాంబో ను చూసేందుకు అయినా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

గతంలో కమల్‌ హాసన్‌ ఒక సారి గుడ్డి వాడి పాత్రలో నటించాడు. కాని అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా వేరు. కనుక ఈ సినిమాలో కమల్‌ గుడ్డి వాడిగా కనిపించేందుకు సిద్దం అవ్వడం చాలా పెద్ద నిర్ణయంగా మీడియా వర్గాల వారు అంటున్నారు. వందల కోట్లు పెట్టుబడి పెట్టే సినిమాలో హీరో గుడ్డి వాడు అయితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అనే భయం నిర్మాతలకు ఉంటుంది. కాని కమల్‌ అక్కడ ఆ పాత్రను చేయబోతున్న కారణంగా నిర్మాత మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా సినిమా ఎంజాయ్‌ చేయవచ్చు అంటున్నారు.

ఈ సినిమా ను వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖైదీ మరియు మాస్టర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లను దక్కించుకున్న కారణంగా విక్రమ్‌ కూడా ఆయనకు మరో విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • vikram movie 
  • vikram 
  • kamala hasan 
  • kamal new movie 
  • kollywood 
  • blind person chracter 
  • fans 
  • pan india movie 
  • vijay setupati 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS