60 కోట్లతో అనుకున్న సినిమా 300 కోట్లతో
ఒక కథను ఏ హీరోతో తీస్తారనే దాన్ని బట్టి దాని బడ్జెట్ నిర్ణయమవుతుంది. మంచి మార్కెట్ ఉన్న హీరో దొరికితే బడ్జెట్ విషయంలోనూ వెసులుబాటు దొరుకుతుంది. అలా ఒక హీరోతో అనుకున్న సినిమాలోకి మరో హీరో వచ్చేసరికి బడ్జెట్ ఐదు రెట్లు పెరిగిపోవడం విశేషం. ఆ సినిమానే.. మహావీర కర్ణ. తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఐతే ముందు ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ రూ.60 కోట్లు మాత్రమేనట. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కథానాయకుడిగా మలయాళం.. తమిళ భాషల వరకే ఈ చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నాడు దర్శకుడు ఆర్.ఎస్.విమల్. కానీ పృథ్వీరాజ్ తో ఆ సినిమా సెట్టవ్వలేదు.
తర్వాత విక్రమ్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. గత కొన్నేళ్లుగా విక్రమ్ ఫామ్ ఏమంత గొప్పగా లేనప్పటికీ అతడికి దక్షిణాదిన అన్ని భాషల్లోనూ గుర్తింపు ఉంది. అన్ని చోట్లా మార్కెట్ ఉంది. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అతను పరిచయమే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడానికి యుఎస్ బేస్డ్ ప్రొడక్షన్ హౌజ్ ‘యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్’ ముందుకొచ్చింది. రాజీ లేకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించుకుని బడ్జెట్ ఏకంగా ఐదు రెట్లు పెంచేసిందట ఆ సంస్థ. మహాభారత కథను కర్ణుడి కోణంలో చూపించే కథ ఇది. ఒక రకంగా చెప్పాలంటే మన ‘దాన వీర శూర కర్ణ’కు అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నమాట. ఈ చిత్రం కోసం ఇప్పటికే విక్రమ్ కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలోనే షూటింగ్ ఆరంభమవుతుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.