దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఈ కాంబో ఎలా ఉంటుందో..!

Update: 2020-03-02 10:45 GMT
నాగచైతన్య హీరోగా దిల్‌ రాజు నిర్మాణం లో ఒక సినిమా రాబోతున్నట్లుగా గత ఏడాదే మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. నాగచైతన్యను ఇండస్ట్రీ కి పరిచయం చేసింది దిల్‌ రాజు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. జోష్‌ చిత్రంతో దిల్‌ రాజు బ్యానర్‌ ద్వారా టాలీవుడ్‌ కు పరిచయం అయిన నాగచైతన్య ఆ సినిమాతో నిరాశ పర్చాడు. మొదటి సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో మళ్లీ అప్పటి నుండి దిల్‌ రాజు బ్యానర్‌ లో చేయలేదు.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ గత ఏడాది వార్తలు వచ్చాయి. దర్శకుడు ఎవరు అనే విషయమై చాలా వార్తలు వచ్చాయి. చివరకు విక్రమ్‌ కె కుమార్‌ పేరు వినిపిస్తుంది. విశ్వసనీయం గా అందుతున్న సమాచారం ప్రకారం దిల్‌ రాజు బ్యానర్‌ లో విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. విక్రమ్‌ కె కుమార్‌ అక్కినేని హీరో అఖిల్‌ తో హలో చిత్రాన్ని చేశాడు. అంతకు ముందు అక్కినేని మనం చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.

అక్కినేని మనం చిత్రం ఎప్పటికి గుర్తుండి పోతుంది. అందుకే విక్రమ్‌ కుమార్‌ అంటే అక్కినేని హీరోలతో పాటు అక్కినేని ఫ్యాన్స్‌ కు కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం తోనే నాగచైతన్య మరోసారి ఆయన దర్శకత్వంలో చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సమ్మర్‌ లో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వం లో ‘లవ్‌ స్టోరీ’ సినిమా ను చైతూ చేస్తున్నాడు. అది సమ్మర్‌ లో రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఏంటీ అనేది క్లారిటీ రాలేదు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో అయినా కావచ్చు అంటూ టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News