• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీటూ వల్ల బ్యాన్‌ అయిన...

మీటూ వల్ల బ్యాన్‌ అయిన డైరెక్టర్‌ రీ ఎంట్రీ

By - Tupaki Desk
Update: 2020-11-11 10:10 GMT
బాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే అందరిలోకి వికాస్‌ బల్‌ ఎక్కువగా కెరీర్‌ లో మీటూ ఆరోపణల వల్ల ఎఫెక్ట్‌ అయ్యాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ 30 సినిమా విడుదల సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మీటూ ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను సినిమా నుండి తప్పించడమే ఉత్తమం అని ఆయన్ను ఒప్పించి తప్పించారు. సూపర్‌ 30 సినిమాకు మంచి ఆధరణ దక్కింది. ఆయన్ను తప్పించినా కూడా ఆ సినిమా దర్శకుడు వికాస్‌ బల్‌ అంటూ అనధికారికంగా ప్రచారం జరిగింది.

ఆ సినిమా తర్వాత ఏడాది పాటు ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఎవరు ఆసక్తి చూపించలేదు.. ఈయన సినిమాలను నిర్మించేందుకు ఏ ఫిల్మ్‌ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎట్టకేలకు వికాస్‌ బల్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ సిద్దం అయ్యాడు. సీనియర్‌ హీరోలు విమర్శలకు భయపడి సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. కాని టైగర్‌ ష్రాఫ్‌ మాత్రం సిద్దం అయ్యాడు. ఇప్పటి వరకు కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు తెరకెక్కించి విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న వికాస్‌ బల్‌ ఈసారి టైగర్‌ ష్రాఫ్‌ తో పక్కా మాస్‌ మసాలా సినిమాను రూపొందించబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

గణ్‌ పత్‌ అనే టైటిల్‌ తో రూపొందబోతున్న ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ కు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. భాగి తరహాలో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా గణ్‌ పత్‌ ఉంటుందని అంటున్నారు. మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత రూపొందిస్తున్న మొదటి సినిమా అవ్వడంతో వికాస్‌ బల్‌ బాగా కసితో ఉన్నట్లగా బాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమాను సక్సెస్‌ చేసుకుని తనపై వచ్చిన విమర్శలకు తెర దించాలని భావిస్తున్నాడట.
Tags:    
  • Vikas Bal 
  • Tiger Shroff 
  • Ganapath 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS