రౌడీ స్టైల్స్.. మొత్తం కాపీ కాదట‌

Update: 2020-02-13 13:30 GMT
రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ అనుస‌రించే ఫ్యాష‌న్స్ .. స్టైలింగ్ ని ప‌రిశీలిస్తే ప్ర‌తిసారీ బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ గుర్తుకు వ‌స్తుంటారు. దీనిపై ఫ్యాన్స్ ఇప్ప‌టికే ప‌లుమార్లు ట్రోల్ చేశారు కూడా. కాపీ కొట్టేయొద్దు అంటూ సూచ‌న‌లు చేశారు. ర‌ణ‌వీర్ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్.. ఫంక్ష‌న్ల‌లో చేసే హంగామా ఎంతో ఎన‌ర్జిటిక్ గా ఉంటుంది. దాంతో దేవ‌ర‌కొండ ఎన‌ర్జీ మ్యాచ్ అవ్వ‌డంతోనే ఇలా పోలిక పెట్టేస్తున్నారు. టాలీవుడ్ లో వేరొక హీరో ఎవ‌రూ అలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా దేవ‌ర‌కొండ‌కు అంత గుర్తింపు ద‌క్కుతోంది.

అయితే ఇలా కాపీ ఎందుకు? అని ప్ర‌శ్నిస్తే.. దానికి విజ‌య్ ప‌ర్స‌న‌ల్ డిజైన‌ర్ నుంచి స‌రైన ఆన్స‌ర్ వ‌చ్చింది. ఇలాంటి పోలిక అనేది స‌హ‌జ‌మే. ప్ర‌తిసారీ ర‌ణ‌వీర్ ని ఇమ్మిటేట్ చేస్తున్న‌ట్టే అనిపించ‌వ‌చ్చు. కానీ ఆ ఇద్దరు ఎన‌ర్జిటిక్ హీరోల అప్పియ‌రెన్స్ అలా భ్ర‌మింపజేస్తుంటుంది. ర‌ణ‌వీర్ ని కావాల‌ని కాపీ కొట్టేయ‌డం ఉండ‌దు. విజ‌య్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకునే నేను డ్రెస్ ని డిజైన్ చేస్తుంటాను. ఏది డిజైన్ చేసినా ర‌ణ‌వీర్ సింగ్ అంటూ పోల్చేస్తున్నారు. అందుకు కార‌ణం ఆ ఇద్ద‌రి శ‌రీరభాష ఒకేలా ఉండ‌డం వ‌ల్ల‌నే. అయితే మేం ఇవేమీ దృష్టి లో పెట్టుకోం.. అని డిజైన‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇక ఇటీవ‌లే విజ‌య్ పింక్ సూట్ సోష‌ల్ మీడియా లో జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ పింక్ సూట్ డిజైన్ చేయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని.. మేమిద్ద‌రం క‌లిసి ఎంపిక చేసుకున్న క‌ల‌ర్ అది అని తెలిపారు. రెట్రో లుక్ ని ఎలివేట్ చేసేందుకే ఈ డిజైన్ ని క‌ల‌ర్ ని ఎంపిక చేసుకున్నామని వెల్ల‌డించారు. అయితే ఇది చేసేప్పుడు ఇంత‌గా వైర‌ల్ అయిపోతుంద‌ని అస్స‌లు ఊహించ‌నే లేదు అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.
Tags:    

Similar News