అబద్ధాలతో మనుగడ నేర్చుకోవాలంటున్న స్టార్ రైటర్

టాలీవుడ్ వెటరన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సంచలనాల గురించి తెలిసిందే. బాహుబలి -ఆర్.ఆర్.ఆర్- భజరంగి భాయిజాన్- మణికర్ణిక లాంటి సెన్సేషనల్ సినిమాలకు కథలు అందించిన గొప్ప కలంబలం ఉన్న వెటరన్ రచయిత. టాలీవుడ్ లో దశాబ్ధాల అనుభవం ఆయనకు ఉంది. జక్కన్న ఆస్థాన విధ్వాంశుడిగా ఎదురే లేదు. అయితే అంతటి మేధావి అయినా విజేంద్రుడు దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఆయన తెరకెక్కించిన శ్రీకృష్ణ 2006- రాజన్న- శ్రీవల్లీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా రాణించలేకపోయాయి. రాజన్న చిత్రం దర్శకుడిగా అతడికి మంచి పేరు తెచ్చినా నిర్మాతలకు లాభాలు తేలేదు.
అసలు ఆయనలో దర్శకుడు లేరని రాజమౌళి అన్నారట. `అలీతో సరదాగా` చిట్ చాట్ లో విజయేంద్రుడే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆయన మాట్లాడుతూ .. శ్రీవల్లి సినిమా చూశాక దర్శకుడిగా పనికి రారని రాజమౌళి తన ముఖంపైనే నిర్మొహమాటంగా చెప్పాశారని తెలిపారు. రాజన్నకు దర్శకత్వం వహించినప్పుడు మెచ్చుకున్నారని వెల్లడించారు. బహుశా అందుకే విజయేంద్ర ప్రసాద్ ఇటీవల కలానికి పని చెబుతున్నారు కానీ దర్శకత్వం ఆలోచన చేయడం లేదంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.
తన కుమారుడు రాజమౌళి గురించి గర్వపడుతున్నానని ఆయన అన్నారు. అతన్ని విజయేంద్ర ప్రసాద్ కొడుకు అని పిలిచిన రోజులున్నాయి. అతడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. ఈ రోజు నన్ను రాజమౌళి తండ్రి అని పిలుస్తున్నారు. నేను ఇప్పుడు అతనితో సరిపోలాలి కాబట్టి ఆందోళనగా ఉన్నాను! అంటూ సరదాగా ముచ్చటించారు.
నాకు ఫిల్మ్ మేకింగ్ తెలియదని రాజమౌళి నాకు చెప్పారు అని విజయేంద్ర ప్రసాద్ నిర్మొహమాటంగా వెల్లడించాడు. సినిమాలు చూసేప్పుడు రాజమౌళి ఎగ్జయిట్ అవుతారని తాను అసలు సినిమాలే చూడనని కూడా విజయేంద్రుడు అన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె అతిపెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజీ కానుందని.. తాను కనిపించే సన్నివేశాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని కితాబిచ్చేశారు. అలాగే అబద్ధాలు చెప్పడం మనుగడ వ్యూహంగా నేర్చుకోవాలని విజయేంద్రుడు వర్ధమాన రచయితలకు సలహా ఇచ్చారు. Full View
అసలు ఆయనలో దర్శకుడు లేరని రాజమౌళి అన్నారట. `అలీతో సరదాగా` చిట్ చాట్ లో విజయేంద్రుడే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆయన మాట్లాడుతూ .. శ్రీవల్లి సినిమా చూశాక దర్శకుడిగా పనికి రారని రాజమౌళి తన ముఖంపైనే నిర్మొహమాటంగా చెప్పాశారని తెలిపారు. రాజన్నకు దర్శకత్వం వహించినప్పుడు మెచ్చుకున్నారని వెల్లడించారు. బహుశా అందుకే విజయేంద్ర ప్రసాద్ ఇటీవల కలానికి పని చెబుతున్నారు కానీ దర్శకత్వం ఆలోచన చేయడం లేదంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.
తన కుమారుడు రాజమౌళి గురించి గర్వపడుతున్నానని ఆయన అన్నారు. అతన్ని విజయేంద్ర ప్రసాద్ కొడుకు అని పిలిచిన రోజులున్నాయి. అతడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. ఈ రోజు నన్ను రాజమౌళి తండ్రి అని పిలుస్తున్నారు. నేను ఇప్పుడు అతనితో సరిపోలాలి కాబట్టి ఆందోళనగా ఉన్నాను! అంటూ సరదాగా ముచ్చటించారు.
నాకు ఫిల్మ్ మేకింగ్ తెలియదని రాజమౌళి నాకు చెప్పారు అని విజయేంద్ర ప్రసాద్ నిర్మొహమాటంగా వెల్లడించాడు. సినిమాలు చూసేప్పుడు రాజమౌళి ఎగ్జయిట్ అవుతారని తాను అసలు సినిమాలే చూడనని కూడా విజయేంద్రుడు అన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ ప్రదర్శనపై మాట్లాడుతూ.. ఆమె అతిపెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజీ కానుందని.. తాను కనిపించే సన్నివేశాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని కితాబిచ్చేశారు. అలాగే అబద్ధాలు చెప్పడం మనుగడ వ్యూహంగా నేర్చుకోవాలని విజయేంద్రుడు వర్ధమాన రచయితలకు సలహా ఇచ్చారు.