పూరి త‌ర్వాత ఆ రికార్డు అనీల్ దే!

టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘ‌న‌త ఎవ‌రిది? అంటే అంతా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పేరు చెబుతారు.;

Update: 2025-12-15 23:30 GMT

టాలీవుడ్ లో అత్యంత వేగంగా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘ‌న‌త ఎవ‌రిది? అంటే అంతా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పేరు చెబుతారు. ఆయ‌న డిక్ష‌న‌రీలో రెండు మూడు నెల‌ల్లోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత చ‌కాచ‌కా షూటింగ్ చుట్టేయడం అన్న‌ది పూరి ప్ర‌త్యేక‌త‌.ఆర్టిస్టుల టైమ్ ఎక్కువ‌గా తీసుకోడు. సినిమాలో ఎంత మంది పెద్ద ఆర్టిస్టులున్నా? ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా డీల్ చేయ‌గ‌ల‌డు.

అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి లెజెండ‌రీనే పెట్టుకుని సినిమా తీసాడంటే? పూరి ఎంత‌టి ప‌ని వంతుడో చెప్పాల్సిన ప‌ని లేదు. పూరి సినిమాల్లో పెద్ద‌గా సెట్స్ కూడా ఉండ‌వు. వీలైనంత వ‌ర‌కూ రోడ్డు, స్టూడియోల్లోనే షూటింగ్ చుట్టేస్తాడు. అవ‌స‌ర‌మైతే పాట‌ల‌కు సెట్స్ వేస్తాడు త‌ప్ప లేదంటే! ఆ ఖ‌ర్చు కూడా నిర్మాత‌కు ఉండ‌దు. సినిమాకు ప‌బ్లిసిటీ ఖ‌ర్చు కూడా పెద్ద‌గా ఉండ‌దు. అది నిర్మాత‌ల ఇష్టం మేర‌కు వ‌దిలేస్తారు. మ‌రి ఇదే త‌రహాలో సినిమాలు చేసే మ‌రో డైరెక్ట‌ర్ ఎవ‌రు? అంటే హిట్ మెషిన్ అనీల్ రావిపూడి పేరు చెప్పొచ్చు.

పూరి విధానంలోనే అనీల్ కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు. ప్రారంభోత్స‌వం అనంత‌రం పెద్ద‌గా స‌మ‌యం తీసుకోడు. సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత ఆర్టిస్టుల డేట్ల‌ను బ‌ట్టి షూటింగ్ చుట్టేస్తాడు. అద‌నంగా డేట్లు తీసుకుని నిర్మాత‌పై బారం వేయ‌డు. క‌థ‌కు అవ‌స‌ర‌మైతే ఎంతైనా ఖ‌ర్చు చేయిస్తాడు. అందులోనూ వీలైనంత తక్కువ‌లోనే సీన్ పూర్తి చేసేలా చూస్తాడు. దీనికి సంబంధించిన అనీల్ రెండు ర‌కాల ప్లాన్ లు ముందుగానే సిద్దం చేసి పెట్టుకుంటాడు. షూటింగ్ పూర్తి చేసిన చిత్రాన్ని అంతే వేగంగాను రిలీజ్ చేయ‌గ‌ల స‌మ‌ర్దుడు.

15 ఏళ్ల కెరీర్ లోనే ఎనిమిది సినిమాలు చేసాడు. వాటి రిలీజ్ విష‌యంలో ఎక్క‌డా జాప్యం జ‌ర‌గ‌లేదు. సాధార‌ణంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో కొంత ఆల‌స్యం జ‌రుగుతుంటుంది. అక్క‌డా కూడా అనీల్ ఎంతో తెలివిగా ప్లాన్చేసి ముందుకెళ్తాడు. తాను తీసిన కంటెంట్ ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డంలోనూ అంతే స‌మ‌ర్ధుడు. ప్ర‌చారం ప‌రంగా నిర్మాత‌కు కోట్ల రూపాయలు ఆదా చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు కూడా. సినిమా పూర్తి చేయ‌డం ఓ ఎత్తైతే? ఆ ప్రోడ‌క్ట్ ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి ప్రచారం పేరుతో కోట్లు ఖ‌ర్చు చేయిస్తారు.

కానీ అనీల్ ఇక్క‌డ‌ ఎంతో స్మార్ట్ గా ఆలోచిస్తాడు. ప్ర‌చారం కోసం సినిమాలో న‌టీన‌టుల్నే తెలివిగా వినియోగిం చుకుంటాడు. ఈ విష‌యంలో సంద‌ర్భాన్ని బ‌ట్టి ర‌క‌ర‌కాల వ్యూహాలు వేస్తుంటాడు. `మ‌న శంవ‌క‌ర ప్ర‌సాద్ గారు` విష‌యంలో ప్ర‌చార‌మంటే దూరంగా ఉండే న‌య‌న‌తార‌నే ఒప్పించి ప‌ని చేయించాడు. ఆ సినిమా ప్రారంభానికి ముందే? ప్రీ లాంచ్ ప్ర‌మోష‌న్ ఎలా చేసాడో? తెలిసిందే. చిరంజీవి, న‌య‌న‌తార లాంటి స్టార్ల‌నే రంగంలోకి ది ప్ర‌చారం చేయించాడు. ఇక రిలీజ్ స‌మ‌యంలో అదే టీమ్ తో ప్ర‌చారం ఏ రేంజ్ లో నిర్వ‌హిస్తాడో చెప్పాల్సిన ప‌నిలేదు.

Tags:    

Similar News