శిరీష్ సెలెబ్స్ లో బీటౌన్ PRs ఎందుకు? ఏంటి సంగతి?

అయితే ఆ వేడుకలకు బాలీవుడ్ సోషలైట్స్ సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి ప్రముఖులు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.;

Update: 2026-02-02 10:10 GMT

అల్లు కుటుంబంలో శుభకార్యానికి కౌంట్‌ డౌన్ మొదలైంది. అదే సమయంలో హీరో అల్లు శిరీష్ చుట్టూ బాలీవుడ్ పీఆర్ హడావుడి పెరగడం ఇప్పుడు టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల దుబాయ్‌ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అక్కడికి హాజరైన బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియాలో చేసిన పోస్టులు.. అన్నీ కలిపి శిరీష్ పేరు ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి.

అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. పెళ్లికి కొన్ని వారాలే మిగిలి ఉండటంతో ఆ జంట దుబాయ్‌ లో ప్రత్యేకంగా ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఆ వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, ఫ్రెండ్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా దుబాయ్ కు వెళ్లి సందడి చేస్తున్నారు.

అయితే ఆ వేడుకలకు బాలీవుడ్ సోషలైట్స్ సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి ప్రముఖులు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారు శిరీష్‌ తో దిగిన ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాలీవుడ్‌ లో కూడా శిరీష్ పేరు ట్రెండ్ అయింది. ముఖ్యంగా పార్టీ, బీచ్ వాక్, లగ్జరీ సెలబ్రేషన్స్‌ కు సంబంధించిన క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఓ వీడియోలో శిరీష్ షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తుండగా ఫ్రెండ్స్ చీర్స్ చెబుతున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే బీచ్‌ లో అల్లు అర్జున్- స్నేహా రెడ్డి జంట సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ డ్రెస్‌ లో స్నేహా రెడ్డి స్టైలిష్‌ గా కనిపించగా, బన్నీ కూల్ లుక్‌ లో ఆకట్టుకున్నారు. మొత్తం వేడుక గ్రాండ్‌ గా, హై ప్రొఫైల్‌ గా జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక ఆ హడావుడి మధ్య మరో ఆసక్తికర ప్రచారం ఊపందుకుంది. అల్లు శిరీష్ త్వరలో బాలీవుడ్‌ లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ ను గ్రాండ్‌ గా లాంచ్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన నటుడిగా కాకుండా నిర్మాతగా మాత్రమే ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే గీతా ఆర్ట్స్ టాలీవుడ్‌ లో విజయవంతమైన బ్యానర్‌ గా నిలిచిన నేపథ్యంలో, ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌ పై కూడా దృష్టి పెట్టే అవకాశముందని ట్రేడ్ టాక్.

అలా ప్రీవెడ్డింగ్ వేడుకలు కూడా నెట్‌ వర్కింగ్‌ లో భాగమేనా అన్న చర్చలు మొదలయ్యాయి. వ్యక్తిగత వేడుకతో పాటు ప్రొఫెషనల్ ప్లానింగ్ కలిసిరావడం శిరీష్‌ కు ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వస్తున్న వార్తల్లో నిజమెంత ఉందో వేచి చూడాలి.

Tags:    

Similar News