ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న 17 చిత్రాలివే..

సాధారణంగా ప్రతి నెల కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు సిద్ధమవుతూ ఉంటాయి.. అందులో కొన్ని చిత్రాలు సెలవు దినాలను చూసుకొని మరీ విడుదలవుతూ ఉంటాయి.;

Update: 2026-02-02 09:56 GMT

సాధారణంగా ప్రతి నెల కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు సిద్ధమవుతూ ఉంటాయి.. అందులో కొన్ని చిత్రాలు సెలవు దినాలను చూసుకొని మరీ విడుదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకొన్ని చిత్రాలు తమ సినిమాలకు పోటీగా పెద్ద సినిమాలు లేకుండా ఉన్న సమయాన్ని ఎంచుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా చిన్న సినిమాలు ఏకంగా 17 సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉండడం గమనార్హం . అయితే ఈ 17 చిత్రాలలో అందరి చూపు విశ్వక్ సేన్ మూవీపై ఉండడం గమనార్హం. మరి ఈ ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఆ 17 చిత్రాలు ఏంటి? ఏ రోజున ఏ చిత్రం విడుదల కాబోతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఫిబ్రవరి 6: (శనివారం )

1. యుఫోరియా

2. శ్రీ చిదంబరం గారు

3. ఎర్ర చీర

4. సుమతీ శతకం

5. లవర్స్ క్రైమ్

6. బ్లడ్ రోజస్

7. హనీ

8. లగ్గం టైం

9. విత్ లవ్

10. బరాబర్ ప్రేమిస్తా

ఇలా మొత్తంగా ఈ ఒక్క వారం ఏకంగా 10 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో బారాబర్ ప్రేమిస్తా, సుమతీ శతకం చిత్రాలపై కాస్త బజ్ ఉంది. మిగతావన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం.

ఫిబ్రవరి 13: (శుక్రవారం)

1. ఫంకీ

విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫిబ్రవరి 14 :(శనివారం)

1. సీత పయనం

2. కపుల్ ఫ్రెండ్లీ

లవర్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. ఆడియన్స్ను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తూ ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రేమికుల రోజున ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 19 :(గురువారం)

1. బైకర్

2. ఆల్కహాల్

ముఖ్యంగా ఈ రెండు చిత్రాలలో శర్వానంద్ బైకర్ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి . ఎందుకంటే శర్వానంద్ తొలిసారి తన కెరీర్లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే అల్లరి నరేష్ ఆల్కహాల్ సినిమాపై కూడా ఒక మేరకు అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండు చిత్రాలపై మోస్తారు క్రేజ్ ఉన్నప్పటికీ ఈ రెండు సినిమాలు ఈ నెల ప్రత్యేకించి ఈ తేదీన విడుదలవుతాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి . పైగా విడుదల తేదీలు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 27 :(శుక్రవారం)

1. చైనా పీస్

2. యండమూరి కథలు

3. ప్రభుత్వ సారాయి దుకాణం

ఇలా మొత్తం 17 చిత్రాలు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతున్నాయి.

Tags:    

Similar News