'మహేష్-రాజమౌళి' మూవీపై మరోసారి స్పందించిన విజయేంద్ర ప్రసాద్..!

Update: 2021-07-21 08:47 GMT
'ఆర్.ఆర్.ఆర్' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతేడాది లాక్ డౌన్ టైం లోనే మహేష్ సినిమాపై జక్కన్న క్లారిటీ ఇచ్చారు. RRR సినిమా కంప్లీట్ అయిన తరువాత ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ టైం రాజమౌళి - మహేష్ కలిసి చేసే ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుంది? ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో రాజమౌళి తండ్రి, దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే మహేష్ కోసం ఓ ఐడియా పై వర్క్ చేస్తున్నారు. ఇది వరకే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గురించి హింట్ ఇచ్చిన పాన్ ఇండియా రైటర్.. తాజాగా మరోసారి 'మహేష్-రాజమౌళి' సినిమా పై మాట్లాడారు.

ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మహేష్ బాబు తో రాజమౌళి చేయబోయే సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌ డ్రాప్‌ లో సెట్ చేయబడుతుందని.. ఇదొక జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. గతేడాది లాక్ డౌన్ సమయంలో ఆఫ్రికా నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ మూవీ కావాలని రాజమౌళి తనతో చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. కథ ఇంకా పూర్తి చేయలేదని.. ప్రస్తుతానికి ఈ ఐడియా మీద వర్క్ చేస్తున్నామని చెప్పారు. దీని కోసం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ రచనలపై స్టార్ రైటర్ రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొదటి సారి మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే ఈ ప్రాజెక్ట్ 'బాహుబలి' 'ఆర్ ఆర్ ఆర్' కంటే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టనుంది. 2022 లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వాస్తవానికి పదేళ్ల క్రితమే ఓ సినిమా కోసం రాజమౌళి - మహేష్ చర్చలు జరిపారు. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనుంది. కాగా, మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన 28వ సినిమా మొదలు పెట్టనున్నాడు. జక్కన్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పూర్తి చేసి తన కోసం స్క్రిప్ట్ రెడీ చేసే లోపు.. మహేష్ ఆల్రెడీ కమిట్ అయిన రెండు సినిమాలను కంప్లీట్ చేయనున్నాడు.
Tags:    

Similar News