బీ టౌన్ లో సేతుపతి జెండా.. కత్రినాతో మూవీకి సిద్ధ‌మైన హీరో!

Update: 2021-02-25 13:40 GMT
'విజ‌య్ సేతుప‌తి' ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీలో మార్మోగుతున్న పేరు. ఇక మీద బాలీవుడ్ లోనూ డీటీఎస్ లో మోతెక్కనుంది! బీటౌన్ టాప్ బ్యూటీ కత్రీనాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు సేతుప‌తి. అమీర్ తో సినిమాను వ‌దులుకున్న మ‌క్క‌ల్ సెల్వ‌న్‌.. క్యాట్ తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇప్పుడు సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు సేతుప‌తి. తీరిక‌లేని షెడ్యూల్స్ తో అమీర్ ఖాన్ చిత్రానికి కూడా ఓకే చెప్ప‌లేక‌పోయాడు. కానీ.. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ లోనూ క‌త్రినా సినిమాకు ఓకే చెప్పడం ఆశ్చర్యమే! త‌మిళ్, తెలుగు, ఇత‌ర ఇండ‌స్ట్రీలు అనే తేడా లేకుండా.. సౌత్ మొత్తం స‌త్తా చాటుతున్నాడు సేతుప‌తి.

ఇక‌, కోలీవుడ్ లో సేతుప‌తి స్టామినా గురించి చెప్పుకోవాల్సిన ప‌నేలేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స‌త్తా చూపుతున్నాడు. దీంతో సేతుప‌తికి  దక్షిణాదిలో ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే..  ఆమీర్ ఖాన్ సినిమా 'లాల్ సింగ్ చద్దా'లో సేతుప‌తి న‌టించాల్సి ఉంది. కానీ.. డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు విజ‌య్‌.

ఇక‌, క‌త్రినా గురించి చూస్తే.. 'భారత్' సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వరకూ హీరోయిన్ క‌నిపించ‌లేదు క‌త్రినా. 'సూర్యవంశీ' రిలీజ్ కావాల్సి ఉన్నప్ప‌టికీ.. 2020లో కరోనా కారణంగా వాయిదా పడింది. అక్ష‌య్ కుమార్ తో ఓ కాప్ మూవీ చేయ‌బోతోందీ పొడుగుకాళ్ల సుంద‌రి. అంతే కాదు.. సల్మాన్ తో 'టైగర్- 3'లో కత్రీనా తన రొమాన్స్ కంటిన్యూ చేయబోతోంది. మ‌రో ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో సినిమాకు సైన్ చేసింది కత్రీనా.

వీరిద్ద‌రూ క‌లిసి దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తో థ్రిల్లర్ చిత్రం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రం షూట్ ఏప్రిల్ నుంచి మొద‌లు కానుంది. కత్రీనా, విజయ్ సేతుపతి ప్ర‌ధాన‌ పాత్రల్లో న‌టిస్తున్నారు. 'అంధాధున్' సినిమాతో బాలీవుడ్ లో స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌న్ నుంచి రాబోతున్న చిత్రం కావ‌డం.. ఇందులోనూ విజయ్, కత్రీనా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.
Tags:    

Similar News