• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానులను నిరాశ పరచిన...

అభిమానులను నిరాశ పరచిన స్టార్ హీరో మూవీ టైటిల్!!

By - Tupaki Desk
Update: 2020-08-05 11:30 GMT
దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇక ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీని కారణంగా దేశంలో అన్నీ రంగాలతో పాటు సినిమా రంగం కూడా ఒక్క‌సారిగా స్థంభించిపోయింది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ప్రజలందరికి సినిమాలతో మస్త్ టైంపాస్ అవుతుంది. అదే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్లు మూసివేసి సైలెంట్ అయింది. ఈ స‌మ్మ‌ర్‌లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. కానీ కరోనా కార‌ణంగా అన్నీ వాయిదా ప‌డ్డాయి. త‌మిళ స్టార్ ఇళయదళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ సినిమా కూడా ఎప్పుడో విడుదలకు రెడీ అయింది.

‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర‌లో నటించారు. అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇదివరకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని విజయ్ మాస్టర్ సినిమా థియేటర్లో కాకుండా డిజిటల్ రిలీజ్ చేస్తారని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. అయితే తాజాగా మాస్టర్ సినిమా దర్శకనిర్మాతలు ఈ వార్తల పై స్పందించారు.

వారు మాస్టర్ డిజిటల్ రిలీజ్ అనే విషయాన్నీ ఖండించారు. ఇక ఈ సినిమాను ఎంత ఆలస్యం అయినా థియేటర్లలోనే విడుదల చేస్తామని తేల్చి చెప్పేసారు. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు కొత్తగా స్ట్రీమ్ చేయబోయే సినిమాల జాబితా విడుదల చేసారు. అందులో మాస్టర్ సినిమా పేరు కనిపించడంతో విజయ్ ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత మాస్టర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అది కొరియన్ మాస్టర్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పుకార్లు నమ్మకండి. మాస్టర్ సినిమా ఎంత ఆలస్యం అయినా థియేటర్లోకే రానుంది. అది ఈ ఏడాది దసరా కావచ్చు లేదా వచ్చే సంక్రాంతి కావచ్చు. కానీ డిజిటల్ రిలీజ్ మాత్రం నిజం కాదు. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గితే అప్పుడు విడుదల చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Tags:    
  • master 
  • Vijay 
  • Lokesh Kangaraj 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS