మిడిల్ ఫింగర్.. అంటున్న రౌడీ హీరో!

Update: 2018-11-12 06:30 GMT
హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం రాత్రి 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా పైరసీ గురయిందని వార్తలు వచ్చాయి కదా.  ఇంటర్నెట్ లో పైరసీ లింకులు ఉన్నాయని జోరుగా వాటికోసం సెర్చ్ జరుగుతోందని కూడా అంటున్నారు.  హీరో విజయ్ దేవరకొండ ఈ పైరసీ విషయంపై కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు.  

ఈ సినిమాను ఎంతోమంది కొత్తవారు పనిచేశారని చెబుతూ వాళ్ళను స్టేజ్ మీదకు పిలిచాడు.  వీళ్ళందరూ ఈ సినిమాకోసం చాలా కష్టపడి పనిచేశారని.. ఈ సినిమాపై అందరి కెరీర్లు ఆధారపడి ఉంటాయని.. అందుకే ప్రేక్షకులు నవంబర్ 17 న థియేటర్లలో చూసి సినిమాను విజయవంతం చేయాలని కోరాడు.  తన రౌడీలకు కూడా ఈ సినిమాను హిట్ చేయాలని పిలుపునిచ్చాడు.  సినిమాను పైరసీ చేసిన ప్రతి ఒక్కరికీ తన మిడిల్ ఫింగర్ చూపించాలని ఉందన్నాడు. ఈ విషయంలో తన ఫ్యాన్స్ అందరూ తనతో కలిసి పైరసీ చేసేవాళ్ళకు మధ్యవేలు చూపించాలని కోరాడు.

లీక్ద్ వెర్షన్ గురించి మాట్లాడుతూ అది సౌండ్ లేకుండా 3.40 గంటలు ఉందని.. దానికి కంప్యూటర్ గ్రాపిక్స్ లేవని.. డీఐ జరగలేదని అసలు పోస్ట్ - ప్రొడక్షన్ కూడా జరగలేదని అన్నాడు.  మరి ఇవేవీ లేని మూడున్నర గంటల సినిమాను చూసిన వారి ఓపికను మెచ్చుకున్నాడు.  ఫైనల్ వెర్షన్ 2.10 గంటలు మాత్రమేనని.. అవుట్ పుట్ బాగా వచ్చిందని తెలిపాడు. సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందనే మాటలు చెప్పానని కాకపొతే సినిమా బాగుందని ప్రేక్షకులను నచ్చుతుందని తెలిపాడు.   
    

Tags:    

Similar News